తన ముద్దుల తనయ అల్లు అర్హా పుట్టిన రోజుని పురస్కరించుకుని స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అద్భుతమైన గిఫ్ట్ లు ఇచ్చారు. మొదట ఓ చిన్న గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన బన్నీ.. ఆ తర్వాత ఏకంగా గుర్రాన్నే బహుమతిగా అందించారు. మార్నింగ్‌ టైమ్‌లో దానిపై ఎక్కించి కాసేపు తిప్పారు. అంతటితో ఆగలేదు, మరో అద్భుతమైన గిఫ్ట్ ని అందించారు. 

పాపులర్‌ మణిరత్నం-ఇళయరాజా సాంగ్‌ `అంజలి.. అంజలి.. ` పాటతో అర్హాపై తీసిన ఓ స్పెషల్‌ వీడియోని గిఫ్ట్ గా అందించారు. ఈ పాటని సామాజిక మాధ్యమాల విడుదల చేశారు. `అంజలి అంజలి` అంటూ సాగే ఈ పాటకి, అల్లు అర్హాని యాప్ట్ గా డిజైన్‌ చేశారు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో విశేషంగా హల్‌చల్‌ చేస్తుంది. 

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ తన ఏంజెల్‌కి బర్త్ డే విశెష్‌ తెలిపారు. అనంతమైన క్యూట్‌నెస్‌ని తనతో తీసుకొచ్చావని తనయని ఆకాశానికి ఎత్తేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు, `అంజలి .. ` సాంగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అలాగే మణిరత్నం- ఇళయరాజా కాంబినేషన్‌లో వచ్చిన  `అంజలి`(1990) చిత్రంలోని పాటని వాడుకున్నందుకు వారికి థ్యాంక్స్ చెప్పారు బన్నీ.