అల్లు అర్జున్ పుట్టిన రోజున మరో ఎనౌన్సమెంట్ రాబోతోంది. అది అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్టు కు సంభందించిన ఎనౌన్సమెంట్. 

స్టార్ హీరో ల పుట్టినరోజున వాళ్ల కొత్త సినిమాలకి సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్స్ బయటకు వస్తుంటాయి. కొత్త చిత్రాల ప్రకటనలు మొదలుకొని... అప్పటికే చేస్తున్న సినిమాల ప్రమోషన్స్ విడుదల వరకూ చాలా సందడే ఉంటుంది. అందుకే ఫ్యాన్స్ ఆ రోజు కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప2’ టీజర్‌ని ఆయన పుట్టినరోజైన ఏప్రిల్‌ 8న విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ మేరకు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ టీజర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెడీ చేస్తున్నారు. సుకుమార్, ఆయన టీమ్ గత కాలంగా టీజర్ కంటెంట్ పై వర్క్ చేస్తున్నారు. వచ్చే నెల నుంచే పబ్లిసిటీ క్యాంపైన్ కు తెర తీయనున్నట్టు సమాచారం. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే ...అల్లు అర్జున్ పుట్టిన రోజున మరో ఎనౌన్సమెంట్ రాబోతోంది. అది అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్టు కు సంభందించిన ఎనౌన్సమెంట్. డైరక్టర్స్ అట్లీ, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీను వీళ్ల ముగ్గురులో ఒకరి ప్రాజెక్టు ఫైనల్ చేసి ఆ రోజు ఎనౌన్సమెంట్ రాబోతోంది. వీళ్లలో ఎవరి కథను ఓకే చేసి ముందుకు తీసుకువెళ్లబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది. ముగ్గురు డైరక్టర్స్ బన్నీతో టచ్ లో ఉన్నారు. దాంతో ఎవరు సినిమా ఎనౌన్సమెంట్ వస్తుందా అనే టెన్షన్ ఆ డైరక్టర్స్, వాళ్ల టీమ్ ల్లోనూ ఉందని సమాచారం.

అయితే అట్లీనే ఫైనల్ అయ్యే అవకాసం ఉందని అంటున్నారు. అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌ఖాన్ హీరోగా గ‌త ఏడాది విడుద‌లైన జ‌వాన్ మూవీ 1100 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. బాలీవుడ్ హిస్ట‌రీలోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. జ‌వాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ త‌ర్వాత అల్లు అర్జున్‌తో అట్లీ సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అట్లీ మార్క్ స్టైలిష్ యాక్ష‌న్ అంశాల‌తో ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. జ‌వాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత అట్లీకి డిమాండ్ పెర‌గ‌డంతో అత‌డు కోరినంత మొత్తాన్ని ఇవ్వ‌డానికి ప్రొడ్యూస‌ర్లు అంగీక‌రించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ మూవీతో కోలీవుడ్‌లో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్‌ను అందుకోనున్న‌ట్లు డైరెక్ట‌ర్ల లిస్ట్‌లో అట్లీ చేర‌నున్నాడు.