అల్లు అర్జున్ తన తదుపరి సినిమా 'ఐకాన్'కి ప్యాన్ ఇండియా అప్పీల్ ఉండేలా చూసుకుంటున్నాడు. దర్శకుడు వేణుశ్రీరామ్ చెప్పిన కథ అల్లు అర్జున్ ని విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. 

ప్రస్తుతం బన్నీ.. త్రివిక్రమ్ రూపొందిస్తోన్న 'అలవైకుంఠపురములో' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత 'ఐకాన్' షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ లాంటి హీరోయిన్ ని తీసుకోవాలనుకున్నారు.

దీంతో నిర్మాత దిల్ రాజు.. అలియా భట్ తో సంప్రదింపులు జరిపారు. కానీ ఆమె తన ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండడంతో బన్నీ సినిమా రిజెక్ట్ చేసింది. దీంతో బాలీవుడ్ లో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు. అదే సమయంలో అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ సినిమా కోసం గీతాఆర్ట్స్ సంస్థ దిశాపటానీని సంప్రదించింది.

అఖిల్ తో సినిమా చేయడానికి దిశా ఆలోచనలో పడింది. పైగా సౌత్ లో సినిమా చేయాలంటే రూ.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాలని ఫిక్స్ అయింది ఈ బ్యూటీ. దీంతో అఖిల్ సినిమా టీమ్ వెనక్కి తగ్గింది. 

అయితే దిల్ రాజు మాత్రం తన 'ఐకాన్' సినిమా కోసం దిశాని సంప్రదించి ఆమె అడిగినంత మొత్తం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆ విధంగా బన్నీ.. దిశాపటానీకి ఫిక్స్ అయ్యారు. గతంలో ఈ బ్యూటీ తెలుగులో వరుణ్ తేజ్ సరసన 'లోఫర్' సినిమాలో నటించింది.