ప్రస్తుతం మన తారల దృష్టి బాలీవుడ్ పై పడింది. తమ మార్కెట్ పరిధిని పెంచుకోవడానికి బాలీవుడ్ లో కూడా సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'బాహుబలి' సినిమాకి బాలీవుడ్ లో క్రేజ్ వచ్చినప్పటి నుండి చాలా మంది హీరోలు, దర్శకులు తమ సినిమాలను కూడా బాలీవుడ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

అందుకే మన హీరోలు ప్యాన్ ఇండియా కథలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. తనకు సమయం దొరుకుతున్న ప్రతీసారి ముంబైకి వెళ్లి అక్కడ దర్శకనిర్మాతలతో భేటీ అవుతున్నట్లు సమాచారం.

బాలీవుడ్ లో తన డెబ్యూ కోసం కొందరు నిర్మాతలతో చర్చలు జరుపుతున్నాడట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అల్లు అర్జున్ నుండి భారీ సినిమా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను రూపొందించనున్నారు.

ప్రస్తుతం బన్నీ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ  సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.రీసెంట్ గా ఈ సినిమా టీమ్ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయింది.

2020 సంక్రాంతికి ఈ చిత్రాన్నిప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలానే వేణుశ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సుకుమార్ తో కూడా సినిమా ఉంటుందని అంటున్నారు.