నానికి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్‌.. `శ్యామ్‌ సింగరాయ్‌` గురించి ఏమన్నాడంటే?

అల్లు అర్జున్‌.. తాజాగా నేచురల్‌ స్టార్‌ నానికి క్షమాపణలు చెప్పారు. ఆయన గురించి చెప్పే సమయంలో దొరకలేదని చెబుతూ లేట్‌ అయినందుకు సారీ అని తెలిపారు బన్నీ. మరి ఇంతకి బన్నీ.. నానికి ఎందుకు క్షమాపణలు చెప్పారంటే. 

allu arjun says sorry to nani regards shyam singha roy here the reasons

ఇటీవల `పుష్ప`(Pushpa) చిత్రంతో బంపర్‌ హిట్‌ని అందుకున్న అల్లు అర్జున్‌(Allu Arjun).. తాజాగా నేచురల్‌ స్టార్‌ నాని(Nani)కి క్షమాపణలు చెప్పారు. ఆయన గురించి చెప్పే సమయంలో దొరకలేదని చెబుతూ లేట్‌ అయినందుకు సారీ అని తెలిపారు బన్నీ. మరి ఇంతకి బన్నీ.. Naniకి ఎందుకు క్షమాపణలు చెప్పారంటే. అల్లు అర్జున్‌.. నిర్మాత దిల్‌రాజు సోదరుడి కుమారుడు ఆశిష్‌రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ `రౌడీబాయ్స్` చిత్రాన్ని రూపొందించారు. అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన `డేట్‌ నైట్` అనే పాటని విడుదల చేశారు Allu Arjun. దీనికి సంబంధించి ఈవెంట్‌ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

 గెస్ట్ గా హాజరైన బన్నీ పాట విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, నిర్మాత దిల్‌రాజుతో `ఆర్య` సినిమా నుంచి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా తనకు లైఫ్‌ ఇచ్చిందన్నారు. దిల్ రాజు లేకపోతే ఆ సినిమా లేదన్నారు. ఆ సినిమా షూటింగ్‌ టైమ్‌లో ఆశిష్‌, అన్షు చిన్నపిల్లలుగా ఉన్నారని, సెట్‌లో ఆడుకునే వారని తెలిపారు. ఇప్పుడు వారం గొప్పగా ఎదుగుతుంటే ఆనందంగా ఉందన్నారు. మన ఫ్యామిలీలోని పిల్లలు మంచి స్థానానికి వస్తే ఎలా ఫీల్‌ అవుతామో, ఇప్పుడు తనకు అలాంటి అనందం కలుగుతుందన్నారు. చిత్ర బృందానికి ఆయన అభినందనలు చెప్పారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలన్నీ బాగా ఆడాలన్నారు. తెలుగు సినిమా ఆడాలని ఆయన వెల్లడించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న `రౌడీబాయ్స్` విడుదల కానుంది. 

అనంతరం బన్నీ.. చెబుతూ  ఇటీవల బాగా ఆడిన సినిమాలకు అభినందనలు తెలిపాడు. `అఖండ` అద్భుతంగా ఆడిందని, ఆ తర్వాత `పుష్ప` మంచి ఆదరణ పొందిందన్నారు. `పుష్ప` తర్వాత విడుదలైన నాని `శ్యామ్‌సింగరాయ్‌` చిత్రంపై ప్రశంసలు కురిపించారు. సినిమా టీమ్‌ని అభినందించాలనుకున్నాను, కానీ అవకాశం దొరకలేదు. లాస్ట్ టైమ్‌ ఈవెంట్‌లో చెప్పాలనుకున్నా మర్చిపోయానని తెలిపారు. అందుకు నానికి క్షమాపణలు తెలిపారు బన్నీ.

``శ్యామ్‌ సింగరాయ్‌` సినిమా చాలా బాగుంది. నానిగారి నటన, సాయిపల్లవి నటన చాలా బాగుంది. దర్శకుడు సినిమాని తీసిన విధానం అద్భుతంగా ఉంది. ఎవరైనా సినిమాని మిస్‌ అయి ఉంటే ఓటీటీలో వచ్చినప్పుడు కచ్చితంగా చూడండి. అందరికి నచ్చుతుంది. టెక్నికల్‌గా చాలా బాగుంది. అందరికి నచ్చాలని కోరుకుంటున్నా` అని తెలిపారు బన్నీ. ఓ రకంగా పడిపోతున్న `శ్యామ్‌సింగరాయ్‌`కి బన్నీ పుష్‌ ఇచ్చారని చెప్పొచ్చు. అంతకు ముందు రామ్‌ చరణ్‌సైతం `శ్యామ్‌ సింగరాయ్‌`పై అభినందనలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కి బన్నీ `పుష్ప` చిత్రంలోని `ఇది సార్‌ నా బ్రాండ్` అంటూ చెప్పిన డైలాగ్‌తో ప్రింట్‌ చేసిన టీషర్ట్ ని వేసుకుని రావడం హైలైట్‌గా నిలిచింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios