జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న డీజే దువ్వాడ జగన్నాథం గ్రాండ్ గా జరిగిన అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ వేడుకకు యూనిట్ చిరంజీవిని పిలవలేదని స్పష్టంచేసిన అల్లు అర్జున్
మెగా కాంపౌండ్ లో తనదైన స్టైల్ తో ప్రత్యేకతను సాధించాడు బన్నీ. మెగా ఫ్యాన్స్ తో పాటు సెపరేట్ గా బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పడ్డాయంటే బన్నీకున్న ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పైగా వరుసగా హిట్స్ ఇస్తూ.. అటెన్షన్ అంతతా తనవైపే తిప్పుకున్నాడు బన్నీ. బన్నీ నటించిన డీజే దువ్వాడ జగన్నాథం రిలీజ్ కి రెడీ అయింది. మరో రెండు రోజుల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దీంతో ఆలస్యం చేస్తే.. ప్రమోషన్ కు ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించిన డీజే టీమ్ ప్రమోషన్ కు కావాల్సిన అన్ని అంశాలపైనా దృష్టి పెట్టింది. ఆ కోవలోనే డీజే ప్రీ రిలీజ్ వేడుక కూడా నిర్వహించారు. అయితే అంతా జరిగాక.. ఇప్పుడు దాసరి మృతికి డీజే వేడుకకు మెగాస్టార్ ను పిలవవక పోవడానికి లింకు పెట్టేస్తున్నాడు అల్లు అర్జున్.
మెగా కాంపౌండ్ హీరోల సినిమాలకు సంబంధించిన ఈవెంట్ జరిగిన దానికి చిరంజీవి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మెగాభిమానులతో పాటు కాంపౌండ్ హీరోలందరికీ చిరంజీవి రావడమే కావాలి. కానీ బన్నీ మాత్రం తన సినిమా ఫంక్షన్ కు చిరంజీవిని కావాలనే ఆహ్వానించలేదు. స్వయంగా తనే ఈ విషయం చెప్తున్నాడు. డీజే ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి రాకుండా ఎలా జరుగుతుందని అంతా అనుకున్నారు. యూనిట్ సభ్యులు కూడా మెగాస్టార్ వస్తారనే చెబుతూ వచ్చారు. చిరంజీవికి కూడా రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ డీజే యూనిట్ నుంచి చిరంజీవికి ఆహ్వానం అందలేదు. మెగాస్టార్ ను మాత్రమే కాదు, డీజే సినిమాతో సంబంధం లేని ఏ వ్యక్తినీ ఆడియో ఫంక్షన్ కు ఆహ్వానించలేదంటున్నాడు బన్నీ.
దర్శకరత్న దాసరి మరణంతో పరిశ్రమలో నిశ్శబ్ద వాతావరణం ఉందని, అలాంటి టైమ్ లో తమ సినిమా ఫంక్షన్ కు ప్రముఖుల్ని పిలిచి వేడుక చేయడం ఇష్టంలేకనే, చిరంజీవితో సహా ఎవర్నీ ఆహ్వానించలేదని క్లారిటీ ఇచ్చాడు బన్నీ. డీజే ఆడియో ఫంక్షన్ చూస్తే సినిమాతో సంబంధం లేని ప్రముఖులు ఎవరూ కనిపించరని అంటున్నాడు. పోనీ ఆడియో ఫంక్షన్ ను రద్దుచేద్దామంటే, అప్పటికే సినిమా విడుదల తేదీ దగ్గర పడ్డంతో.. ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను పెట్టాల్సి వచ్చిందంటున్నాడు బన్నీ.
అయితే నిజంగా దాసరి మృతికి సంతాపంగా ఫంక్షన్ రద్దు చేయాలనుకుంటే డీజే టీం ఆ పని చేసి ఉండొచ్చు. ఎందుకంటే, మెగా కాంపౌండ్ కు అలవాటైన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టుకోవడానికి అప్పటికింకా వారం గడువు ఉండనే ఉంది. కానీ డీజే యూనిట్ మాత్రం ఆ పని చేయలేదు. అసలు దాసరి చనిపోయినా.. డీజే ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి వచ్చారెందుకని ఫీలయ్యే వారు కూడా ఎవరూ ఉండరు. మెగా కాంపౌండ్ కు పెద్ద దిక్కు అయి ఉండీ చిరంజీవి బన్నీ ఈవెంట్ కు రాలేదేంటా అనేవారే తప్ప ఎందుకొచ్చాడని అడిగేవారూ లేరు. మెగా కాంపౌండ్ కు చెందిన హీరో సినిమా ఫంక్షన్ కు చిరంజీవి రావడం అత్యంత సహజంగా జరగాల్సిందే. ఇలాంటి నేపథ్యంలో బన్నీ చెప్తున్న రీజన్ కొత్త డౌట్స్ క్రియేట్ చేస్తోంది.
