‘ఓ మై ఫ్రెండ్‌’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ సినిమా అనుకున్నంతస్థాయిలో ఆడకపోవడంతో కొన్నేళ్లపాటు ఇంటికే పరిమితమైన దర్శకుడు వేణు శ్రీరామ్‌. మూడో చిత్రం ‘వకీల్‌సాబ్‌’తో తన లక్‌ను పరీక్షించుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   ‘వకీల్‌సాబ్‌’ కి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్దాయి సూపర్ హిట్ రావటంతో ఆయన తదుపరి చిత్రం ఏమై ఉండవచ్చు అనే విషయమై ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

అయితే అందుతున్న సమాచారం మేరకు వేణు శ్రీరామ్ తన తదుపరి చిత్రం స్క్రిప్టు పనిలో పడ్డారు. ఆ నెక్ట్స్ ఫిల్మ్ కూడా దిల్ రాజు నిర్మాతగానే ఉండబోతోంది. .అల్లు అర్జున్ తోనే ..గతంలో మొదలెట్టిన ‘ఐకాన్‌’ స్క్రిప్టుతోనే రూపొందించబోతున్నాడు అని తెలుస్తోంది  దీంతో.. వ‌కీల్ సాబ్ కాంబో మ‌ళ్లీ రిపీట్ కాబోతోంద‌ని అందరికీ అర్దమైంది. అయితే అల్లు అర్జున్ తోనే ఈ సినిమా ఉంటుందా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఐకాన్ స్క్రిప్టుని వేరే హీరోకు వినపించబోతున్నట్లు చెప్తున్నారు. ఐకాన్ విష‌య‌మై ఇప్పటికే దిల్ రాజు తో డిస్క‌ష‌న్స్ కూడా జ‌రిగాయ‌ని తెలుస్తోంది. వేరే హీరో కోసం కాబట్టి వేణు శ్రీరామ్ స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయబోతున్నారట.  

రీసెంట్ గా 'వకీల్ సాబ్' ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈ దర్శకుడు.. 'ఐకాన్' ప్రాజెక్ట్ గురించి స్పందించారు. ''ఆ ప్రాజెక్ట్ గురించి టైం వచ్చినప్పుడు మాట్లాడతాను. పాస్ట్ ఈజ్ పాస్ట్. నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్ల నుంచి సినిమా తీయడానికి ట్రై చేస్తూ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను. ఏది జరిగినా మూవ్ ఆన్ అవ్వాలి'' అని శ్రీరామ్ తెలిపారు.