ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు అయిన  అల్లు బాబీ వివాహం నిన్న (జూన్ 21న) జరిగింది. అయితే ఈ విషయం మీడియాకు ఎక్కనివ్వలేదు. చివరిదాకా సీక్రెట్ గానే ఉంచి, తన కుటుంబ సభ్యులు కొంతమంది అతిధుల సమక్షంలో సీక్రెట్ గా  వివాహం చేసుకున్నారు. నీల షా అనే యోగా ట్రైనర్ ని బాబీ వివాహమాడారు ఈ వివాహ వేడుక హైదరాబాద్లోని ఐటిసి కోహినూర్ హోటల్లో జరిగింది. 

అయితే ఈ వివాహం జరిగిన విషయాన్ని అల్లు ఫ్యామిలీ చాలా సీక్రెట్ గా ఉంచింది. బాబికి సెకండ్ మ్యారేజ్  కావడంతో ఇంత సీక్రెట్‌గా జరిగిందని సమాచారం. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న ఫొటోలను బట్టి చూస్తే అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్క శిరీష్, అల్లు అరవింద్  హాజరయ్యారు. అల్లు అర్జున్ కానీ ఆయన భార్య కానీ వెళ్లలేదు.

ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన నీల స్వస్థలం ముంబై. సోదరితో కలిసి ఆమె యోగా డెస్టినేషన్ పేరుతో హైదరాబాద్ నగరంలో యోగా స్టూడియో నిర్వహిస్తోంది. నీల తండ్రి కమల్ కాంత్ ఒక వ్యాపారవేత్త. గత సంవత్సరకాలంగా డేటింగ్ చేస్తున్న వీరి వివాహం పట్ల రెండు ఫ్యామిలీలు హ్యాపీగా ఉన్నాయి. 

ఇక ఇప్పటికే బాబీకి మొదటి పెళ్లికాగా మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో  విడాకులు తీసుకున్నట్లు సమాచారం. వీరికి అన్విత అనే కుమార్తె కూడా ఉంది.  అల్లు బాబీ గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో నిర్మితమయ్యే సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుంటారు.