Asianet News TeluguAsianet News Telugu

Akhanda: బాలయ్య కోసం రాజమౌళి, బన్నీ.. ఇండస్ట్రీ చూపు `అఖండ` ఈవెంట్‌పైనే.. ఏం జరగబోతుంది?

`అఖండ` చిత్ర ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వస్తున్నారు. తాజాగా `ఆర్‌ఆర్‌ఆర్‌` డైరెక్టర్‌ రాజమౌళి కూడా స్పెషల్‌ గెస్ట్ గా హాజరు కాబోతున్నారని చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఇప్పుడు `అఖండ` ఈవెంట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

allu arjun rajamouli will attend balakrishna akhanda event this matter is hot topic
Author
Hyderabad, First Published Nov 26, 2021, 10:13 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలకృష్ణ(Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన `అఖండ`(Akhanda) చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రేపు(శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక జరగబోతుంది. ఈ చిత్ర ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) వస్తున్నారు. తాజాగా `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR) డైరెక్టర్‌ రాజమౌళి(Rajamouli) కూడా స్పెషల్‌ గెస్ట్ గా హాజరు కాబోతున్నారని చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఇప్పుడు Akhanda Pre Release Eventపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హాట్‌ టాపిక్‌గా మారుతుంది. అయితే Balayya సినిమా ఈవెంట్ కి మెగా హీరో గెస్ట్ గా రావడమే అత్యంత ఇంట్రెస్ట్ గా మారింది.

నిర్మాత అల్లు అరవింద్‌ సారథ్యంలో నడుస్తున్న `ఆహా`లో బాలయ్య `అన్‌స్టాపబుల్‌` టాక్‌ షోకి హోస్ట్ గా చేస్తున్న నేపథ్యంలో వాళ్ల మధ్య ఏర్పడిన రిలేషన్‌ కారణంగా బన్నీ గెస్ట్ గా హాజరు కాబోతున్నారని అంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు రాజమౌళి సైతం స్పెషల్‌  గెస్ట్ గా హాజరు కాబోతుండటం మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. కొత్త చర్చకు తెరలేపుతుంది. ఎందుకంటే బాలయ్యని, రాజమౌళిని ఒకే వేదికపై చూడటం చాలా అరుదు. ఊహకందని విషయం కూడా. కానీ ఇప్పుడు కలవబోతున్నారు. ఒకే వేదికపైకి రాబోతున్నారు. బాలయ్య సినిమాని ప్రమోట్‌ చేయడంలో రాజమౌళి కీలక పాత్ర పోషించబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

అయితే నెక్ట్స్ అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప`(Pushpa) సినిమా విడుదల కాబోతుంది. డిసెంబర్‌ 17న ఇది రిలీజ్‌ కానుంది. ఆ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` రిలీజ్‌ కానుంది. ఇది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. `అఖండ` ఈవెంట్‌ని తమ సినిమాల ప్రమోషన్‌కి వాడుకోబోతున్నారనే చర్చ కూడా మొదలైంది. బాలయ్య సినిమా ఈవెంట్‌లోనే వీరు తమ సినిమాలని కూడా ప్రమోట్‌ చేసుకునేందుకు ప్లాన్‌ చేశారనే టాక్‌ సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. 

అదే సమయంలో మరో కొత్త విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టికెట్‌ రేట్ల విషయంలో చట్టం తెచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే టికెట్లు అమ్ముకోవాలని, అవి కూడా ఆన్‌ లైన్‌లోనే అమ్మాలని, రోజుకి కేవలం నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాలనే బిల్లుకి ఆమోదం తెలిపింది. దీంతో ఇది పెద్ద సినిమాలపై, భారీ బడ్జెట్‌ చిత్రాలపై తీవ్ర ప్రభావం పడబోతుంది. కలెక్షన్లకి పెద్ద గండి కొట్టబోతుంది. ఈ విషయంలో పెద్ద సినిమాల నిర్మాతలు అసంతృప్తితో ఉన్నారు. పైకి స్పందించకపోయినా లోలోపల రగిలిపోతున్నారు. నలిగిపోతున్నారు. ఎట్టకేలకు చిరంజీవి స్పందించి దీనిపై మరోసారి ఆలోచించాలని, ఇండస్ట్రీ మనుగడకి కూడా ప్రయారిటీ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఏపీ సీఎం జగన్‌కి ట్వీట్‌ చేశారు. 

అయితే ఇప్పుడు `అఖండ` వేదికపై ఈ విషయం చర్చకు రాబోతుందని టాక్‌. బాలకృష్ణ సైతం ఏపీ ప్రభుత్వానికి యాంటీగానే ఉన్నారు. పైగా ప్రతిపక్షం కూడా. దీంతో ఈ వేడుకలో దీనిపై హాట్‌ కామెంట్స్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్‌, రాజమౌళి సైతం ఇదే విషయంపై తమ అభిప్రాయాలను వెల్లడించబోతున్నారని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. `అఖండ` వేదికగా ఏపీ ప్రభుత్వానికి తమ రిక్వెస్ట్ ని తెలియజేయబోతున్నారని సమాచారం. దీంతో ఇప్పుడు `అఖండ` ఈవెంట్‌పైనే అందరి చూపు ఉంది. ఇందులో ఏం జరగబోతుంది. బాలకృష్ణ, రాజమౌళి, బన్నీ ఏం మాట్లాడబోతున్నారని టాలీవుడ్‌ మొత్తం ఆతృతగా వెయిట్‌ చేస్తున్నారట. మరి ఏం జరగబోతుందనేది చూడాలి. `అఖండ` ఎలాంటి సంచలనాలకు తెరలేపబోతుందనేది వేచి చూడలి. 

also read: Allu Arjun with NBK: `నందమూరి`తో `అల్లు` బంధం.. బన్నీ మాస్టర్‌ ప్లాన్‌ అదేనా? షాక్‌లో మెగా ఫ్యాన్స్ ?

Follow Us:
Download App:
  • android
  • ios