పుష్ప2 షూటింగ్ షురూ కాబోతోంది. అన్ని అస్త్రాలురెడీ చేసుకుని షూటింగ్ కోసం రంగంలోకి దిగబోతున్నారు టీమ్. ఇంతకీ పుష్ప2 షూటింగ్ ఎక్కడ స్టార్ట్ కాబోతుందో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,, జీనియస్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా పుష్ప..ది రైజ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈసినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను శేక్ చేసింది. కలెక్షన్ల వాన కురిపించింది. బాక్సాఫీస్ దగ్గర రికార్డులను కొల్లగొట్టింది. అయితే రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలప్ పుష్పపార్ట్ 1 మాత్రమే రిలీజ్ అయ్యింది. ఇక పార్ట్2 సినిమా కోసం దేశమంతా ఎంతో ఉత్కంటతో ఎదురుచూస్తోంది.
పుష్ప ..ది రూల్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ షూటింట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. వారి కోసం ఓ ఆసక్తికర అప్‌డేట్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం పుష్ప 2 షూటింగ్ ను శుభప్రదంగా తనసొంత స్టూడియోలోనే స్టార్ట్ చేయబోతున్నాడట బన్నీ. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో లాంఛ్ కాబోతున్న అల్లు స్టూడియోస్ పుష్ప2 షూటింగ్ ను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట టీమ్. కానుందట.
అల్లు స్టూడియోస్ అక్టోబర్ 1న హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభం కానుంది. ఇదే నిజమైతే అల్లు రామలింగయ్య సేవలకు కొనసాగింపుగా లాంఛ్ కాబోతున్న అల్లు స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుకోనున్న మొదటి సినిమా పుష్ప 2 అవుతుంది. సెంటిమెంట్ గా కూడా బన్నీకి కూడా ఇది కలిసి వస్తుంది. అండ్ చాలా ప్రత్యేకం అవుతుంది. అందుకే మేకర్స్ ఇలా ప్లాన్ చేశారని సమాచారం.
ఫస్ట్ పార్టును మించి సీక్వెల్‌ను భారీ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు సుకుమార్. పుష్ప 2లో కూడా అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా కన్న కస్తూరి రష్మిక మందన్నా నటించబోతోంది. ఇక రెండో పార్టులో ఫహద్ ఫాసిల్ పోలీస్ పాత్ర కొనసాగింపు ఉండగా..ఈ సారి విజయ్ సేతుపతి కీ రోల్‌లో కనిపించబోతున్నాడనే టాక్ ఉంది. పుప్ప పార్ట్ 1 మ్యానియా వల్ల ఈసినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి సుక్కు ప్లానింగ్ ఎలా ఉంటుందో.
