Asianet News TeluguAsianet News Telugu

#AlluArjun:‘పుష్ప 2’రిలీజ్ డేట్ ఫిక్స్...ఆ రోజేనా?

సుకుమార్ డైరెక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలోని డైలాగులు, పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 

Allu arjun Pushpa :The Rule to release on this day?
Author
First Published May 31, 2023, 3:08 PM IST | Last Updated May 31, 2023, 3:08 PM IST


              అల్లు అర్జున్ హీరోగా  సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప ది రైజ్’. 2021 డిసెంబ‌ర్‌లో విడుద‌లైన ఈ చిత్రం ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే. బాక్సాఫీస్‌ దగ్గర రూ.350 కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించి అల్లుఅర్జున్‌కు నేషన్  వైడ్ గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ చిత్రం ఎలాంటి ప్రమోష‌న్లు చేయ‌కుండానే రూ.100 కోట్ల నెట్ సాధించి అక్క‌డి విశ్లేష‌కుల‌ను సైతం ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్‌ కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.కాస్త లేటుగా షూటింగ్ మొదలైనా స్పీడుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడనేది అంతటా చర్చనీయాంశంగా మారింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం  December 22న ఉంటుందని తెలుస్తోంది. దాదాపు ఇదే డేట్ ని దర్శక,నిర్మాతలు ఫిక్సైనట్లు చెప్తున్నారు.  మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ టాక్ వినిపిస్తోంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల ‘పుష్ప ది రూల్‌’లో కీలక పాత్ర కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్  సాయి పల్లవిని చిత్రం టీమ్ సంప్రదించిందట. అయితే, ఆమె ఈ క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకోలేదట. ఈ నేపథ్యంలో ఆ పాత్ర కోసం నిహారిక పేరు పరిశీలిస్తున్నారట. ఆల్మోస్ట్ ఆమెను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన అమ్మాయి పాత్రలో నిహారిక కనిపించనున్నట్లు తెలుస్తోంది.    
 
 ఇక  పుష్ప సినిమాలో తాను చెప్పిన డైలాగ్ తగ్గేదేలే ఎలా హిట్ అయిందో మనకు తెలిసిందే.అయితే పుష్ప2 లో మాత్రం అస్సలు తగ్గేదేలే అనే డైలాగ్ ఉండబోతుంది అంటూ  అల్లు అర్జున్ తన సినిమా గురించి అప్డేట్ గతంలో ఇచ్చారు. దాంతో ఈ సినిమా గురించి  అభిమానులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తూ అస్సలు తగ్గకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఇన్ అసోసియేట్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి  నిర్మిస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో రష్మిక మరోసారి సందడి చేయనున్నారు. ఇంకా సునీల్, అనసూయ తదితరులు నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట రికార్డులు క్రియేట్ చేసింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios