Asianet News TeluguAsianet News Telugu

#Pushpa2:అమేజాన్ ప్రైమ్ కు భారీ షాక్ ఇచ్చిన 'పుష్ప'

పుష్ప 2 సినిమాకు ఫుల్ క్రేజ్ ఉండటంతో ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు నెట్‍ఫ్లిక్స్ ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. దాంతో ఇప్పుడు అమేజాన్ ప్రైమ్ కు పుష్ప విషయంలో పెద్ద షాక్ తగిలింది. 

Allu Arjun Pushpa Shock To Prime Video jsp
Author
First Published Jan 16, 2024, 11:17 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు  జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది.. ఈ క్రమంలో  ఇప్పుడు అంతా ‘పుష్ప ది రూల్’ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది (2024) ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేఫద్యంలో ఈ చిత్రం ఓటిటి రైట్స్ హాట్ హాట్ గా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయం. ఈ క్రమంలో తాజాగా పుష్ప 2 సినిమా ఓటీటీ రైట్స్ తమకే అని నెట్ ప్లిక్స్ ప్రకటించింది. 

వాస్తవానికి  2021లో వచ్చిన పుష్ప పార్ట్ 1 హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.30కోట్లకు దక్కించుకుంది. తాజాగా సీక్వెల్ గా వస్తున్న ‘పుష్ప 2’ మూవీ డిజిటల్ హక్కులు కూడా అమేజాన్ కే వస్తాయని అందరూ భావించారు. అయితే ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు  అంతకంటే మూడు రెట్లు అధికంగా చెల్లించి నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది… సుమారు రూ.100కోట్లకు ఈ ఓటీటీ డీల్ జరిగినట్టు సమాచారం.. పుష్ప 2 సినిమాకు ఫుల్ క్రేజ్ ఉండటంతో ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు నెట్‍ఫ్లిక్స్ ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. దాంతో ఇప్పుడు అమేజాన్ ప్రైమ్ కు పుష్ప విషయంలో పెద్ద షాక్ తగిలింది. 

అప్పట్లో పుష్ప థియేటర్ లో  రిలీజైన 21 రోజులకే తమ ఓటిటిలో స్టీమింగ్ చేసింది అమేజాన్ ప్రైమ్. దాంతో కొత్త వ్యూయర్స్, సబ్ స్కైబర్స్ వచ్చి పడ్డారు. అప్పుడు పండగ చేసుకుంది అమేజాన్. ఆ స్పీడే  ఇప్పుడు దెబ్బ కొట్టిందంటున్నారు.  ముందుగా పుష్ప 2 హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఎంతగానో పోటీ పడింది. అయితే, ఈ సీక్వెల్ రైట్స్ కోసం మేకర్స్ భారీగా డిమాండ్ చేయటంతో అమెజాన్ ప్రైమ్ వీడియో వెనక్కి తగ్గింది.. 

ఈ రైట్స్ కోసం ముంబై నుంచి హైదరాబాద్ కు అమేజాన్ లో పెద్ద స్దాయి వ్యక్తులు రంగంలోకి దిగారని, నెలల తరబడి నెగోషియేషన్స్ జరిపారని చెప్తున్నారు. మైత్రీ మూవీస్ సినిమాలని మొదటి నుంచి అమేజాన్ ప్రైమ్ రైట్స్ తీసుకుంటూ వస్తోంది. ఓ మాదిరిగా ఆడిన సినిమాలకు కూడా రిలేషన్ కోసం మంచి రేట్ పే చేస్తోంది. అలాంటప్పుడు ఇలాంటి పెద్ద సినిమా రైట్స్ తమకే ఇవ్వాలి కదా వారు అంటున్నారట.కానీ అంత బడ్జెట్ పెట్టి సినిమా తీసేటప్పుడు ఎమోషన్స్ కి లోనైతే ఇబ్బంది అవుతుందని మంచి రేటు రాగానే నెట్ ప్లిక్స్ కు ఇచ్చేసినట్లు చెప్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios