పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ నేపథ్యంలో సెకండ్ పార్ట్ పై భారీ హైప్ ఏర్పడింది. పుష్ప ది రూల్ (Pushpa The Rule)ఎప్పుడు థియేటర్స్ లో దిగుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పుష్ప హిందీలో భారీ వసూళ్లు సాధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ లో కూడా వినిపిస్తుంది. బాలీవుడ్ చిత్ర వర్గాలు పుష్ప (Pushpa) చిత్రాన్ని, అల్లు అర్జున్ నటనను పొగుడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న బన్నీ కల పుష్ప నెరవేర్చినట్లేనని చెప్పాలి.
ఇక అన్ని భాషల్లో కలిపి వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్ల గ్రాస్ రాబట్టింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టి కొత్త రికార్డ్స్ ఆయన పేరిట లిఖించింది. పుష్ప విజయాన్ని దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రష్మిక మందాన (Rashmika Mandanna)విషయానికొస్తే అమ్మడు భారీగా రెమ్యూనరేషన్ పెంచేశారట. మొన్నటి వరకు రూ. 2 కోట్లు తీసుకున్న రష్మిక ఇకపై రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. పుష్ప పార్ట్ 2కి రష్మిక రెమ్యునరేషన్ మూడు కోట్లని సమాచారం.
పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ నేపథ్యంలో సెకండ్ పార్ట్ పై భారీ హైప్ ఏర్పడింది. పుష్ప ది రూల్ (Pushpa The Rule)ఎప్పుడు థియేటర్స్ లో దిగుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 2022 క్రిస్మస్ కానుకగా పుష్ప పార్ట్ 2 విడుదల చేయాలనేది మేకర్స్ ప్రణాళికగా తెలుస్తుంది. 2021 క్రిస్మస్ కి పుష్ప పార్ట్1 తో విజయాన్ని అందుకున్న టీమ్ పార్ట్ కూడా అదే పండుగకు తీసుకురావాలని అనుకుంటున్నారట. మార్చి లో సెట్స్ పైకి వెళ్లనున్న షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి 2022 డిసెంబర్ నెలలో విడుదల చేస్తారట.
పుష్ప పార్ట్ 1 లో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ చివర్లో ఎంట్రీ ఇచ్చారు. సునీల్, అజయ్ ఘోష్ విలన్స్ గా కనిపించారు. పార్ట్ 2లో మాత్రం ఫహాద్ ఫాజిల్, అల్లు అర్జున్ మధ్య నడిచే ఆధిపత్య పోరుగా పుష్ప సాగనుందని అర్థం అవుతుంది. పుష్ప ది రైజ్ క్లైమాక్స్ పార్ట్ 2 పై ఆసక్తి కలిగేలా దర్శకుడు రూపొందించాడు. దేవిశ్రీ సాంగ్స్, రష్మిక మందాన గ్లామర్ సినిమా విజయంలో భాగమయ్యాయి.
ఇక అల్లు అర్జున్ (Allu Arjun)డీగ్లామర్ లుక్, మేనరిజం అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతం అన్న మాట వినిపిస్తుంది. బాలీవుడ్ ప్రముఖులు సైతం పుష్ప మూవీలో అల్లు అర్జున్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడడం విశేషం. అల్లు అర్జున్ కష్టానికి పుష్ప మంచి ఫలితాన్నిచ్చింది.
