మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆ సినిమాకి, ఈ సినిమాకి ఒకేలా ఉంది, ఫలనా ట్యూన్‌, ఆ సినిమాలోని కాపీ కొట్టారనే టాక్‌ చాలా సందర్బాల్లో వినిపిస్తుంటుంది. తెలుగు టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్ విషయంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. తాజాగా దేవిశ్రీప్రసాద్‌పై కాపీ విమర్శ వినిపిస్తుంది. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన `పుష్ప` చిత్ర టీజర్‌ని బుధవారం సాయంత్రం విడుదల చేశారు. బన్నీ బర్త్ డేని పురస్కరించుకుని ఈ టీజర్‌ని విడుదల చేశారు. 

ప్రస్తుతం ఆ టీజర్‌ రికార్డ్ లు సృష్టిస్తుంది. ఇప్పటికే ఇది ముప్పై మిలియన్స్ కి పైగా వ్యూస్‌ని సాధించింది. ఇందులో పుష్పరాజ్‌గా బన్నీ యాక్షన్‌ గూస్‌బమ్స్ వచ్చేలా చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడిది వివాదంలో ఇరుక్కుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కాపీ అంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. దేవి `అవేంజర్‌` అనే హాలీవుడ్‌ చిత్రం నుంచి కాపీ కొట్టారని అంటున్నారు. అదే సమయంలో హిందీలో అక్షయ్‌ కుమార్‌ నటించిన `బేబీ` చిత్రంలోని ఓ సన్నివేశంలో వచ్చే బీజీఎంని కాపీ కొట్టారనే వార్త హల్‌చల్‌ చేస్తుంది. 

సోషల్‌ మీడియాలో పలువురు నెటిజన్లు ఆ సినిమా వీడియోని, `పుష్ప` టీజర్‌ వీడియోని మ్యాచ్‌ చేస్తూ కాపీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దొరికిపోయారు దేవిగారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇది యాదృశ్చికంగా జరిగిందా? లేక కాపీ కొట్టారా? అన్నది సస్పెన్స్. బీజీఎం గత సినిమాలకు దేనికో ఓ దానికి మ్యాచ్‌ కావడం జనరల్‌గానే జరుగుతుంటుంది. అందులో యాదృశ్చికమే అయి ఉంటుంది. కావాలని కాపీ ఎవరూ కొట్టరని దేవి ఫ్యాన్స్ చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ `పుష్ప కాపీ` మ్యాటర్‌ సోషల్‌ మీడియాలో వివాదంగా మారింది. దేవికి తలనొప్పి గా మారిందని చెప్పొచ్చు. ఇక రష్మిక మందన్నా కథానాయికగా, మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 13న విడుదల కానుంది.