Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ పుష్ప గురించి నోరు జారిన సుకుమార్... షాకింగ్ న్యూస్ చెప్పి నాలుక కరుచుకున్న డైరెక్టర్

స్టార్ డైరెక్టర్ సుకుమార్ పప్పులో కాలేశాడు. పోరపాటున టాప్ సీక్రేట్ బయట పెట్టేశాడు. ఇది బయట చెప్పొందంటూ బ్రతిమలాడాడు. ఇది నిజంగా పొరపాటున చేశాడా..? కావాలని హింట్ ఇచ్చాడా..? ఇంతకీ ఏంటా సీక్రేట్. ..? 
 

Allu Arjun Pushpa Movie Director Sukumar Revel Secret for Pushpa2
Author
First Published Sep 18, 2022, 10:58 AM IST

టాలీవుడ్ లో జీనియస్ డైరెక్టర్ గా పేరు ఉంది సుకుమార్ కు . చాలా ఆలోచించి సినిమాల చేస్తాడు.. సినిమా ప్లాప్ అయినా.. తన మార్క్ సినిమాగా గుర్తుండిపోయేలా చేస్తాడు సుక్కు. అటువంటి సుకుమార్ పప్పులోకాలేశాడంటే ఎవరైనా నమ్ముతారా.. ? తెలియక జరిగిందో.. లేకకపోతే కావాలనే హింట్ ఇచ్చడో తెలియదు కాని.. పుష్ప2 సినిమాకు సంబధించిన ఓ హైలెట్ టాప్ సీక్రేట్ ను టక్కున చెప్పేశాడు సుక్కు. చెప్పిన తరువాత నాలుకు కరుచుకున్నాడు.

అసలు విషయమేంటంటే, పుష్ప 2 ని ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్న సుకుమార్ అండ్ టీమ్.. ఈసినిమాను ఫారెన్ లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అందులో భాగంగానే  రష్యాలో ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారట. ఈ  విషయాన్ని స్వయంగా సుకుమారే చెప్పి అయ్యే అనుకున్నాడు.  ఓ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన సుకుమార్ అక్కడ ఓ రష్యన్ అమ్మాయ్ తన అభిమానినని చెప్పడంతో ఉప్పొంగిపోయాడు. అనుకోకుండా ఈ సీక్రేట్ ను బయట పెట్టేశాడు. 

ఈ విషయం చెప్పిన సుకుమార్ పొరపాటు జరిగిందని  నాలుక కరుచుకున్నాడు. అంతే కాదు ఇది పొరపాటున జరిగింది. నేను చెప్పాలని చెప్పలేదు. దయచేసి ఈ పాయింట్ ఎడిట్ చేసేయండి. మీడియా మిత్రులు ఈవిషయాన్ని బయట చెప్పోదు ప్లీజ్. అంటూ.. బ్రతిమలాడారు. 

ఇక్కడ మరో వాదన ఏంటీ అంటే.. జీనియస్ డైరెక్టర్ గా పేరు ఉన్న సుకుమార్ మరీ అంత టంగ్ స్లిప్ అయ్యేంత తెలివి తక్కువోడేం కాదు. అంటున్నారు సినీ జనాలు. ఆయనకు ఉన్న పేరే లెక్కల మాస్టారు.. ఏది లెక్క పెట్టకుండా అలా చేసేయ్యరు అంటున్నారు.  ఈ లీకేజీ కూడా సినిమాకి హైప్ పెంచేందుకే అనకుంటున్నారు. ఏది ఏమైనా.. ఈ మ్యాటరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తుంది. 

 పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు బన్నీ. అంతే కాదు బాలీవుడ్ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు వరుస కడుతున్నట్టు తెలుస్తోంది. అటు ఇండియాతో పాటు ఫారెన్ లో కూడా బన్నీకి ఫ్యాన్స్ స్టార్ట్ అయ్యారు. పుష్పను ఇమిటేట్ చేస్తూ.. చాలా వీడియోస్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. రష్యన్. కొరియన్ , చైనా జనాలు  కూడా ఈసినిమా పాటలను డబ్ స్మాష్ వీడియోలుగా చేసి ఫేమస్ అయ్యారు. దాంతో పుష్పకు అక్కడ క్రేజ్ భారీగా పెరిగింది. దీంతో పుష్ప  కోసం అక్కడ కూడా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. దాంతో డిమాండ్ ఎక్కువగా ఉన్న రష్యాలో ఈసినిమాను వదలాలని నిర్ణయించకున్నాడట సుక్కు. 

మొదటి పార్ట్ వరల్డ్ వైడ్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో, రెండో పార్ట్ పుష్ప పై అంచనాలు భారీగా పెరిగిపోయాయ్. ఆ అంచనాల్ని అందుకునేలా అవుట్ పుట్ ఉండాలనే లేటైనా లేటెస్ట్ స్ర్కిప్ట్‌తో సిద్ధమయ్యాడు డైరెక్టర్ సుకుమార్. చాలా కాలం గ్యాప్ ఇచ్చి.. అంతా రెడీ చేసుకుని.. పక్కాగా ప్రీపేర్ అయ్యి.. షూటింగ్ కోసం రంగంలోకి దిగారు టీమ్. ఫస్ట్ పార్ట్ లో చేసిన తప్పులు ఇప్పుడు రిపీట్ కాకుండా చూసుకోవాలని టీమ్ అంతా అనుకున్నట్టు తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios