అల్లు అర్జున్‌ `బాహుబలి`ని టార్గెట్‌ చేశాడా?.. `పుష్ప` రెండు భాగాలు..నిజం ఇదేనా?

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. `పుష్ప` సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోందనేది ఈ వార్త సారాంశం. 

allu arjun pushpa in two patrs and its target bahubali arj

అల్లు అర్జున్ గతేడాది `అల వైకుంఠపురములో` చిత్రంతో నాన్‌ `బాహుబలి` రికార్డులు బద్దలు కొట్టాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఏకంగా రెండువందల యాభై కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసినట్టు చిత్ర వర్గాల టాక్‌. అదే సమయంలో వచ్చిన మహేష్‌ బాబు `సరిలేరు నీకెవ్వరు` సినిమాని మించి దూసుకుపోయి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం బన్నీ.. తనకు `ఆర్య`, `ఆర్య2` వంటి హిట్స్ ఇచ్చన సుకుమార్‌ దర్శకత్వంలో `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. 

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఆగస్ట్ 13కి విడుదల చేయాలనేది చిత్ర యూనిట్‌ ప్లాన్‌. కానీ ఇప్పుడు కరోనాతో షూటింగ్‌ ఆగిపోయింది. ఏకంగా బన్నీకి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. `పుష్ప` సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోందనేది ఈ వార్త సారాంశం. దీంతో బన్నీ ఫ్యాన్స్ దీన్ని వైరల్‌ చేసే పనిలో బిజీగా ఉన్నారు. 

అదే సమయంలో ఓ కొత్త న్యూస్‌ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాతో బన్నీ ఏకంగా `బాహుబలి`ని టార్గెట్‌ చేశాడని. `పుష్ప` సినిమాని `బాహుబలి` మాదిరిగానే రెండు భాగాలుగా రిలీజ్‌ చేయాలనే అనుకుంటున్నారట. కలెక్షన్ల పరంగానూ ఆ సినిమాతో పోటీ పడాలనే ఆలోచనలో ఉన్నారట. బన్నీ తన `అల వైకుంఠపురములో` ఏడాది ఫంక్షన్‌లో ఇది ప్రారంభం మాత్రమే, నెక్ట్స్ లెవల్‌ మున్ముందు చూపిస్తా అని కామెంట్‌ చేశారు. `పుష్ప` టీజర్‌లోనూ `తగ్గేదెలే.. `అని అన్నారు. చూడబోతే బన్నీ టార్గెట్‌ `బాహుబలి` అనే వార్త సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. అయితే `పుష్ప` రెండు భాగాలు అనే వార్తల్లో నిజం లేదని, జస్ట్ అది గాసిప్‌ మాత్రమే అని చిత్ర వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మరి ఏది నిజమనేది మున్ముందు తేలనుంది.

 ఇక `పుష్ప`లో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో బన్నీ పుష్పరాజ్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌ సంచలనం క్రియేట్‌ చేస్తుంది. ఇది 60 మిలియన్స్ కి పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇందులో అనసూయ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios