Asianet News TeluguAsianet News Telugu

మాస్ జాతర : 'పుష్ప – 2 ద రూల్' టీజర్.. అల్లు అర్జున్‌ నయా అవతార్‌

 ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా..

Allu Arjun Pushpa 2 The Rule Teaser released jsp
Author
First Published Apr 8, 2024, 11:37 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు  జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది.. ఈ క్రమంలో  ఇప్పుడు అంతా ‘పుష్ప ది రూల్’ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ  ఏడాది (2024) ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 
 
 ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి. ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేసారు మేక‌ర్స్ . 

ఈ టీజర్ లో అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియ‌స్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తున్నాడు. ఈ సంవ‌త్స‌రం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.  ఈరోజు పుట్టిన‌రోజు జ‌రుపుకోనున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఈ సంవ‌త్స‌రం ప్ర‌త్యేక‌మైన‌దిగా చెప్పుకోవ‌చ్చు. ఈ సంవ‌త్స‌రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లొ  గ‌ర్వ‌కార‌ణం గా నిలిచింది.  

మొట్ట‌ మెద‌టిసారిగా తెలుగు క‌థానాయ‌కుడు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు తీసుకోవ‌డం, మెట్ట మెద‌టిసారిగా ద‌క్షిణ భార‌తదేశ న‌టుడు దుబాయ్ లొ మ్యాడ‌మ్ టుసార్ట్ లో స్టాట్యూ క‌ల‌గ‌ట‌మే కాకుండా మెద‌టి తెలుగు న‌టుడుగా గ్యాల‌రీ ని ఏర్పాటు చేయ‌టం అభిమానులు అందరికీ  గ‌ర్వ‌కార‌ణం.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios