యాక్షన్ మూడ్ లో అల్లు అర్జున్, పుష్ప2 నెక్స్ట్ షెడ్యూల్ కి అంతా సిద్దం..?
నెక్ట్స్ ఇయర్ రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు పుష్ప మూవీ మేకర్స్. ఈసారి ఆస్కార్ టార్గెట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. తాజా షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది పుష్పటీమ్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో..తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప2. పుష్ప సినిమాతో ఇండియా వైడ్ గా స్టార్ డమ్ సంపాదించిన బన్నీ.. ఈసినిమాతో దేశ విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ను సంపాదించాడు. అంతే కాదు పుష్పతో మొట్టమొదటి సారి టాలీవుడ్ కు.. ఉత్తమ కథానాయకుడు కేటగిరీలో జాతీ అవార్డ్ కూడా సాధించి.. కొత్త రికార్డ్ ను సాధించాడు అల్లు అర్జున్.
ఇక పుష్ప2ను అంతకు మించి ఆలోచనలో ఉన్నారు టీమ్. ఈసారి ఎలాగైనా ఆస్కార్ వరకూ వెళ్లాలని పట్టుదలతో ఉన్నాడు బన్నీ. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా షూటింగ్ ను చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఇప్పటికే మేజర్ షెడ్యుల్ ను కంప్లీట్ చేసిన టీమ్.. తాజా షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ లు చేయడానికి సన్నాహాలు చేసుకుంటుంది.
తాజాగా ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ వీక్ లో ఆల్మోస్ట్ రేపటి నుండి ఈ సినిమాకి సంబందించిన కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం. ఈషెడ్యూల్ ను హైదరాబాద్ లోనే ప్లాన్ చేస్తున్నారట టీమ్. అంతే కాదు ఈ షెడ్యూల్ లో పుష్ప2కి సబంధించిన యాక్షన్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
అల్లు అర్జున్ ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల వెడ్డింగ్ కోసం ఇటలీ కి వెళ్ళారు. పెళ్లి తర్వాత బన్నీ రిటర్న్ కానున్నారు. బన్నీ వచ్చేవరకూ అంతా రెడీ చేసుకుని.. ఆయన రాగానే షూటింగ్ ను స్టార్ట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారట టీమ్. ఇక ఈమూవీలో అల్లుఅర్జున్ జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, ఫాహద్ ఫజిల్, ధనంజయ, అనసూయ భరద్వాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.