మహేష్ నిర్మాతగా ఉన్న మేజర్ మూవీపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. మేజర్ లాంటి హృదయాలను హత్తుకునే చిత్రం తెరకెక్కించిన మహేష్ కి నా స్పెషల్ రెస్పెక్ట్ అంటూ ట్వీట్ చేశారు.
అడివి శేష్ (Adivi Shesh) హీరోగా తెరకెక్కిన మేజర్ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. దర్శకుడు శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించగా.. మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కించారు. విడుదలకు ముందే మేజర్ చిత్ర ప్రీమియర్స్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రదర్శించారు. ఇక మొదటి షో నుండే మేజర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
విమర్శకులతో పాటు ఆడియన్స్ మేజర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ రియల్ హీరో ఎమోషనల్ జర్నీ చూసి కన్నీరు పెట్టుకుంటారు. నిన్నటి నుండి చిత్ర ప్రముఖులు మేజర్ చిత్రాన్ని పొగుడుతూ ట్వీట్స్ వేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) చేరారు. ఆయన మేజర్ మూవీ అద్భుతం అంటూ కొనియాడారు. హీరో అడివి శేష్, హీరోయిన్స్ శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ నటనను ప్రత్యేకంగా పొగిడారు. దర్శకుడు శశి కిరణ్ తిక్కా, సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాలను మెచ్చుకున్నారు.
ఇక మేజర్ చిత్ర నిర్మాత మహేష్ బాబుని(Mahesh Babu) అల్లు అర్జున్ ప్రత్యేకంగా పొగిడారు. హృదయాలను హత్తుకునే గొప్ప చిత్రం నిర్మించినందుకు మహేష్ గారికి నా స్పెషల్ రెస్పెక్ట్ అన్నారు. మేజర్ ప్రతి భారతీయుడిని తాకే సినిమా అంటూ కొనియాడారు. మహేష్ ని ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప మూవీని పొగుడుతూ మహేష్ బాబు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే మహేష్ సర్కారు వారి పాట చిత్రంపై అల్లు అర్జున్ స్పందించలేదు.
ఇక మేజర్ (Major Movie)మూవీపై అల్లు అర్జున్ ట్వీట్ ఆ సినిమాకు మంచి ప్రచారం కల్పిస్తుంది. తెలుగులో రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకున్న మేజర్.. హిందీలో సెకండ్ డే పుంజుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేజర్ రూ.13.4 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లుగా తెలుస్తుంది. అడివి శేష్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా ఇది రికార్డులకు ఎక్కింది. మేజర్ పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల చేశారు.
