పవన్ పై బన్నీ స్పెషల్ పోస్ట్ చూశారా?

allu arjun posts pawan's photo with an interesting caption
Highlights

'చెప్పను బ్రదర్' అనే కామెంట్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాడు 

'చెప్పను బ్రదర్' అనే కామెంట్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాడు అల్లు అర్జున్. ఆ తరువాత తన తప్పు తెలుసుకొని ఎంతగా పవన్ ఫ్యాన్స్ కు దగ్గరవుదామని చూసిన వర్కవుట్ కాలేదు. రీసెంట్ గా తన సినిమా థాంక్స్ మీట్ కు పవన్ ను ఆహ్వానించి మేమంతా ఒక్కటే అని చెప్పాలనుకున్నాడు బన్నీ.

రీసెంట్ గా పవన్ రాజకీయాలపై కూడా స్పందించాడు బన్నీ, ఒక వ్యక్తి నిజాయితీగా సేవ చేయలనుకుంటున్నాడని తన మావయ్యను తెగ పొగిడాడు. తాజాగా బన్నీ పవన్ ను ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టాడు. అందులో ''లివ్ బై యువర్ ట్రూ మ్యాడ్ నెస్.. ది వరల్డ్ విల్ అడ్జస్ట్(సిద్ధాంతాల కోసం పిచ్చిగా జీవించాలి. అప్పుడు ప్రపంచం కూడా నీతోపాటు సర్దుకుపోతుంది)'' అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు బన్నీను ప్రశంసలలో ముంచెత్తుతున్నారు. 


 

loader