సోషల్ మీడియాలో తన పర్సనల్ లైఫ్ విశేషాలు ఎప్పటికప్పుడు పెట్టే అల్లు అర్జున్ లేటెస్ట్ గా స్టైలిష్ స్టార్ పెట్టిన పోస్ట్ కు అబిమానుల్లో ఆనందోత్సాహాలు తన కూతురు అర్హతో కలిసి సరదాగా దిగిన ఫొటోను ట్విటర్ లో పెట్టిన అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తనకున్న ఇమేజ్ కు తగ్గట్లే ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవడం, స్టైల్ మెయింటైన్ చేయడం అలవాటు. తన ఫ్యామిలీని ఎంతగానో ప్రేమించే అల్లు అర్జున్ తన ఫ్యామిలీ కి సంబంధించిన విశేషాలు కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ.. సోషల్ మీడియాలో తన పర్సనల్ లైఫ్ విశేషాలు, పోటోలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతుంటాడు స్టైలిష్ స్టార్. తాజాగా తన కూతురు అర్హ ఫోటోను ట్విట్టర్ లో పెట్టి అందరికీ పరిచయం చేశాడు.
అల్లు అర్జున్ కు ఇద్దరు పిల్లలు. ఒక బాబు, ఒక పాప. బాబు పేరు అయాన్. పాప పేరు అర్హ. అయాన్ వయసు నాలుగేళ్లు కాగా.. అర్హ వయసు ఏడాదిలోపే.! తండ్రి అయిన క్షణం నుంచి అల్లు అర్జున్ ఆ క్షణాలను ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నట్టు ఎన్నో వేదికలపై చెప్పాడు. ఇటీవల డీజే ఆడియో ఫంక్షన్ లో కుమారుడు అయాన్.. అందరికీ చేతులెత్తి నమస్కరించడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తాత, ముత్తాతలకు తండ్రికి తగ్గ వారసుడొచ్చాడని అంతా ముక్కున వేలేసుకున్నారు.
అయాన్ ను పలు వేదికలపై ఇప్పటికే పరిచయం చేశాడు అల్లు అర్జున్. అయితే కుమార్తె అర్హను మాత్రం ఎప్పుడూ చూపించలేదు. తాజాగా.. ట్విట్టర్ లో ఓ అందమైన ఫోటో పెట్టాడు.. నేను.. నా అందమైన ఏంజెల్ అని ట్యాగ్ లైన్ పెట్టాడు. నేవీ బ్లూ గౌనులో అర్హ బ్యూటిఫుల్ అండ్ క్యూట్ గా ఉంది. ఈ పిక్ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్.. తెగ సంబరపడిపోతున్నారు.
