బన్నీ ఈసారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడట!

Allu Arjun playing dual roles
Highlights

బన్నీ కోసం కూడా ఓ ప్రయోగాత్మక కథ రాసుకుంటాడనుకుంటే ఈసారి మాస్ ఎంటర్టైనర్ కథతో సినిమా చేయబోతున్నాడు. కథ ప్రకారం సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటివరకు డ్యూయల్ రోల్ లో కనిపించింది లేదు. కానీ మొదటిసారిగా ఆయన కోసం డ్యూయల్ రోల్ తో కూడిన ఓ కథను సిద్ధం చేసుకున్నాడట దర్శకుడు విక్రమ్ కె కుమార్. ఈ మధ్య కాలంలో బన్నీ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. 'డిజె' సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అయినా.. సినిమా పట్ల నెగెటివ్ టాకే ఎక్కువగా వినిపించింది.

ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ఫ్లాప్ గా తేల్చేశారు. దీంతో తన తదుపరి సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అల్లు అర్జున్. ఇంతకాలం సమయం తీసుకొని ఇప్పుడు దర్శకుడు విక్రమ్ కుమార్ తో సెట్స్ పైకి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. విక్రమ్ గతంలో మనం, హలో వంటి సినిమాలను రూపొందించాడు. బన్నీ కోసం కూడా ఓ ప్రయోగాత్మక కథ రాసుకుంటాడనుకుంటే ఈసారి మాస్ ఎంటర్టైనర్ కథతో సినిమా చేయబోతున్నాడు.

కథ ప్రకారం సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం. విక్రమ్ మాస్ ఎంటర్టైనర్ చేయడం పైగా బన్నీ డ్యూయల్ రోల్ కావడంతో  సినిమాపై అంచనాలు పెరుగిపోతున్నాయి. నల్లమలుపు బుజ్జి, సనం నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. 

loader