ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే బన్నీ నా పేరు సూర్య అనంతరం చాలా స్లో అయ్యాడు. ఆ సినిమా రిలీజయ్యి చాలా కాలమవుతున్నా కూడా ఇంకా మరో సినిమాను మొదలెట్టలేదు. నెక్స్ట్ త్రివిక్రమ్ తో చేస్తున్నట్లు అఫీషియల్ గా చెప్పేశాడు. ఇక రీసెంట్ గా సుకుమార్ తో కూడా కమిటయ్యారు. 

ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ అల్లు అర్జున్ పక్కా ప్లానింగ్ తో వెళుతున్నాడు. మెయిన్ గా త్రివిక్రమ్ సినిమాను 60 రోజుల్లో ఫినిష్ చెయ్యాలని ఫిక్స్ అయినట్లు కండిషన్ పెట్టాడట. త్రివిక్రమ్ కూడా అత్తారింటికి దారేది సినిమా నుంచి తన స్టైల్ ను పూర్తిగా మార్చుకొని స్పీడ్ పెంచాడు. ఇక సుకుమార్ ప్రాజెక్ట్ అయితే అంత త్వరగా ఎండ్ అవ్వదని అందరికి తెలిసిన విషయమే. 

అందుకే త్రివిక్రమ్ సినిమాను త్వరగా ఫినిష్ చేసి సుక్కు కథకు షిఫ్ట్ అవ్వాలని బన్నీ ప్లాన్ వేస్తున్నాడు. మే నెలలో బన్నీ త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక కుదిరితే దసరా లేదా దీపావళి, క్రిస్మస్ కి సినిమాను అభిమానుల ముందు ఉంచవచ్చు. ఇక సుకుమార్ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.