Asianet News TeluguAsianet News Telugu

నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా రివ్యూ..

నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా రివ్యూ..

Allu Arjun Naa Peru Surya Naa illu India Movie Review

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో క్రేజ్ ఎక్కువ. ఆయన నటన, డాన్స్ అంతా చాలా స్టైలిష్ గా ఉంటాయి. మెగా కాంపౌండ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా..  అతి తక్కువ కాలంలోనే తానెంటో నిరూపించుకున్నాడు.
దువ్వాడ జగన్నాథం చిత్రం తర్వాత బన్నీ నుంచి వచ్చిన చిత్రం ‘ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’.వక్కంతం వంశీ తొలిసారిగా ఓ సినిమాకి దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూసేద్దామా..

నటీనటులు..
అల్లు అర్జున్, అనుఇమ్మాన్యుయల్, రావు రమేష్, బొమన్ ఇరానీ, అర్జున్, శరత్ కుమార్, నదియా తదితరులు...

కథేంటి...
సూర్య(అల్లు అర్జున్‌) ఒక సైనికుడు. కోపం ఎక్కువ. చిన్న తప్పు జరిగినా తట్టుకోలేని మనస్తత్వం. హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి బోర్డర్‌ వెళ్లాలన్నదే అతడి లక్ష్యం. ఇంతలో పై అధికారులకు తెలియకుండా ఒక ఉగ్రవాదిని కాల్చి చంపేస్తాడు. దీంతో సైనిక నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన సూర్యను ఆర్మీ నుంచి బయటకు పంపించాలని కల్నల్‌(బొమన్‌ ఇరానీ) నిర్ణయిస్తాడు. కానీ, అందుకు ఒప్పుకోని సూర్య తన గాడ్‌ ఫాదర్‌(రావురమేష్‌)ను రంగంలోకి దింపుతాడు. అంతా బాగానే ఉందని వైజాగ్‌లో ఉన్న సైకియాట్రిస్ట్‌ రఘురామ కృష్ణంరాజు(అర్జున్‌) దగ్గర సంతకం తీసుకొస్తే బోర్డర్‌కు పంపుతానని కల్నల్‌ చెబుతాడు. రామకృష్ణంరాజు 21రోజుల సమయం ఇచ్చి, కోపం తగ్గించుకుని రమ్మని సూర్యకు చెబుతాడు. మరి ఆ ఛాలెంజ్‌లో సూర్య నెగ్గాడా? అతను బోర్డర్‌కి వెళ్లాడా? రఘురామ కృష్ణంరాజుకు సూర్యకు ఉన్న బంధం ఏంటి? అనేదే ‘నా పేరు సూర్య’

ఎలా ఉంది..
యాంగ్రీ ఆర్మీ ఆఫీసర్ గా అల్లు అర్జున్ బాగా నటించాడు. సూర్య పాత్ర కోసం బన్ని మారిన తీరు అభిమానులను సైతం ఆశ్చర్య పరుస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌ పాత్రను తీర్చిదిద్దిన విధానం సరికొత్తగా ఉంది. ఇక ‘ఫస్ట్‌ ఇంపాక్ట్‌’, ‘ట్రైలర్‌’లలో చూపించినట్లు యాక్షన్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేశారు. ఆర్మీ ట్రైనింగ్‌ సన్నివేశాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. పాత్ర కోసం బన్ని పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. సెకండ్ ఆఫ్ లో కోపాన్ని తగ్గించుకోవడానికి బన్నీ చేసే ప్రయత్నాలు
ఆకట్టుకుంటాయి. హీరోయిన్ పాత్ర కేవలం పాటలకే పరిమితమైంది. మిగితా నటీనటులు తమ పరిధి మేరకు బాగానే నటించారు. కెమేరా పనితనం బాగుంది. సినిమా అక్కడక్కడ సాగతీతగా అనిపించింది. పాటలు కూడా వినడానికి అంత సూపర్ గా ఏమీలేవు. లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో మాత్రమే వినడానికి, చూడటానికి బాగుంది.

బలాలు..
అల్లు అర్జున్
సీనియర్ తారాగణం, యాక్షన్ సన్నివేశాలు

బలహీనతలు..
కథ ఆర్మీ బ్యాగ్రౌండ్ అయినా.. కథనం రొటీన్ గా ఉండటం
అక్కడక్కడ సాగతీత సన్నివేశాలు
కామెడీ లేకపోడం


ఓవరాల్ గా సినిమా  యావరేజ్ అనే చెప్పవచ్చు.రామ్ చరణ్ ‘ రంగస్థలం’, మహేష్ ‘భరత్ అను నేను’ సినిమాల మాదిరి తన సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని భావించిన అల్లు అర్జున్ కోరిక తీరనట్టే. 

రేటింగ్ : 2.5/5

Follow Us:
Download App:
  • android
  • ios