రికార్డు ధరకు నా పేరు సూర్య శాటిలైట్ హక్కులు

రికార్డు ధరకు నా పేరు సూర్య శాటిలైట్ హక్కులు

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన అల్లు అర్జున్ తాజాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీతో మార్కెట్ లో తన పట్టేంటో మరోసారి నిరూపించుకున్నాడు అల్లు అర్జున్. శాటిలైట్, డిజిటల్ రైట్స్ విషయంలో అల్లు అర్జున్ స్టామినా మరోసారి రుజువు చేస్తూ.. ‘నా పేరు సూర్య’  ఏకంగా పాతిక కోట్ల రూపాయలకు రైట్స్ ధర పలికాయని తెలిసింది.


టీవీలో ప్రసారం చేసుకునే హక్కులతో పాటు డిజిటల్ మీడియా ప్రసార హక్కులను కూడా ఒక సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం. పాతిక కోట్ల రూపాయల మొత్తాన్ని వెచ్చించడానికి సదరు సంస్థ ఏ మాత్రం వెనుకాడలేదని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇటీవలి సినిమా థియేటర్ల వద్ద కన్నా వెబ్ మీడియాలో, టీవీలో బాగా హిట్ అయ్యాయి.
 

ఈ హీరో సినిమాలు సరైనోడు, డీజేలకు బెస్ట్ టీఆర్పీలు వచ్చాయి. సరైనోడు డబ్బింగ్ వెర్షన్లను యూట్యూబ్ లో పెడితే వాటికి రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ హీరో తదుపరి సినిమాకు ఈ భారీ నంబర్ వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ సింహభాగం శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలోనే రికవర్ అవుతుండటం దీని నిర్మాతలకు కూడా ఉత్సాహాన్ని ఇస్తోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos