Asianet News TeluguAsianet News Telugu

అమీర్ పేటలో అల్లు అర్జున్ మల్టీ ప్లెక్స్ .. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

త్వరలో తన వ్యాపారం మొదలెట్టబోతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అందరు స్టార్ల మాదిరిగానే తను కూడా సినిమాలతో పాటు బిజినెస్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. ముందుగా మల్టీ ప్లెక్స్ ఓపెనింగ్ కు రెడీ అవుతున్నాడు బన్ని. 
 

Allu Arjun Multiplex Opening in Ameerpet coming Soon
Author
First Published Dec 8, 2022, 6:09 PM IST

అందరు స్టార్ల మాదిరిగానే తను కూడా సినిమాలతో పాటు బిజినెస్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు అల్లు అర్జున్. ముందుగా మల్టీ ప్లెక్స్ ఓపెనింగ్ కు రెడీ అవుతున్నాడు బన్ని. 

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు.. ఇటు సినిమాలు అటు బిజినెస్ లు నడిపిస్తూ.. చేతినిండా సంపాదిస్తున్నారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండలు.. ఇప్పటికే ఏసియన్ సంస్థతో కలిసి మల్టీ ప్లెక్స్ లలోభాగస్వాములుగా ఉండగా..ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వీరి బటలోనే నడవబోతున్నారు. ఇప్పటికే ఏసియన్ తో కలిసి నిర్మించిన మల్టీ ప్లెక్స్ ఓపెనింగ్ కు రెడీగా ఉంది. 

టాలీవుడ్ స్టార్స్ సినిమాలు, అడ్వటైజ్మెంట్స్ తో పాటుగా హోటల్, థియేటర్ బిజినెస్‌లోకి కూడా అడుగు పెడుతున్నారు. సినిమాల్లో రెమ్యూనరేషన్ గా పొందిన కోట్ల రూపాయిలను ఇతర బిజినెస్ ల్లో.. ఇన్వెస్ట్ చేస్తున్నారు. హీరోలు కాస్తా.. బిజినెస్ మెన్లుగా మారిపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి AMB సినిమాస్, భార్య నమ్రత పేరు మీద హోటల్ బిజినెస్ ప్రారంభించారు. ఏషియన్ సంస్థ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో లగ్జీరియస్ హోటల్స్ స్థాపించి, సక్సెస్ అయితే థియేటర్ బిజినెస్ మాదిరిగానే ఇండియా అంతటా తమ హోటల్స్‌ని విస్తరింపజెయ్యాలనే ప్లాన్‌లో ఉన్నారు..

మల్టీప్లెక్స్ నిర్మాణంలో  దూసుకెళ్తున్న ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏ ఏ ఏ సినిమాస్  అనగా ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ ను స్టార్ట్ చేయబోతున్నాడు బన్ని. అమీర్ పేట్ సత్యం థియేటర్‌ ప్లేస్ లో భారీ మల్టీ ప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఇక త్వరలో ఈ బిల్డింగ్ ఓపెనింగ్ కు రెడీ అవుతుంది. 

అడ్వాన్స్ టెక్నాలజీతో.. అత్యాధునిక హంగులతో ఈ థియేటర్  అద్భుతంగా కట్టపడింది.  ఏషియన్ సత్యం మాల్ & మల్టీప్లెక్స్ నిర్మాణం రీసెంట్ గా పూర్తయింది. ఈ మల్టీ ప్లక్స్ ను జనవరిలో  ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు చేసుకుంటున్నారని  సమాచారం.. ప్రస్తుతం ఈ న్యూస్ తో పాటు.. థియేటర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ..ఈ నెలలో పుష్ప2 షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.  ఇక పుష్ప సినిమా రష్యా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ కోసం అక్కడికెళ్లిన టీం అక్కడ సందడి.. సందడి చేశారు. అంతే కాదు ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. 

Follow Us:
Download App:
  • android
  • ios