మొత్తానికి సాధించాడు పరశురామ్. అప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబును ఓపికగా ఉండి ఒప్పించాడు.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో కూడా అదే ఓపిక చూపించాడు ఇంతకీ పరశురామ్ తో.. బన్నీ సినిమా ఓకే అయినట్టేనా...? 

మొత్తానికి సాధించాడు పరశురామ్. అప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబును ఓపికగా ఉండి ఒప్పించాడు.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో కూడా అదే ఓపిక చూపించాడు ఇంతకీ పరశురామ్ తో.. బన్నీ సినిమా ఓకే అయినట్టేనా...?

ఫిల్మ్ ఇండస్ట్రీలో రేర్ కాంబినేషన్స్ కు బీజం పడుతుంది. ఆడియన్స్ అస్సలు ఊహించని కాంబినేషన్ లు సెట్ కాబోతున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... క్రియేటీవ్ డైరెక్టర్ పరశురామ్ కలయికలో సినిమా సెట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. 

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో ఆ మధ్యన వచ్చిన పుష్ప దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 ను తెరకెక్కించే పనిలో ఉన్నారు టీమ్. రీసెంట్ గా ఈ సినిమా ఓపెనింగ్ పూజ కూడా జరిగిపోయింది. ఈ మన్త్ లో రెగ్యూలర్ షూటింగ్ కు వెళ్ళబోతున్నారు టీమ్. పుష్ప పార్ట్ 1 టైమ్ లోనే ఓ 20 పర్సంట్ షూటింగ్ పార్ట్ 2 కోసం కూడా చేశారట.... ఇక చకచకా పార్ట్ 2 కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. 

ఇక ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే సినిమా ఏంటీ..? ఈ విషయంలోనే క్లారిటీ కనిపించలేదు. అయితే బోయపాటితోగానీ .. కొరటాలతో గాని బన్నీ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. అందుకు కారణం గతంలోనే వాళ్లు ఆయనకి కథ చెప్పి ఒప్పించడం. కొరటాలతో అయితే సినిమా అనౌన్స్ మెంట్ కూడా చేశారు. అయితే వాళ్లతో కంటే ముందుగా పరశురామ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేయనున్నాడని టాలీవుడ్లో టాక్ గట్టిగా వినిపిస్తోంది. రీసెంట్ గా ఆయన వినిపించిన లైన్ అందుకు కారణమని అంటున్నారు. 

పరశురామ్ ఒక లైన్ చెప్పీ చెప్పడంతోనే బన్నీ మెస్మరైజ్ అయ్యాడట. మెడికల్ మాఫియా నేపథ్యంలో పరశురామ్ .. ఇచ్చిన చిన్న లింక్ క అల్లు అర్జున్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అయితే ఈ లైన్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో, పూర్తి కథను రెడీ చేసి చెప్పమన్నాడని త్వరగా పూర్తి కథను రెడీ చేయమని కూడా చెప్పారట అల్లు అర్జున్. ప్రస్తుతం పరశురామ్ అదే పనిలో ఉన్నాడని ఇండస్ట్రీ టాక్. అయితే పరశురామ్ నాగచైతన్యతో సినిమా చేయాల్సి ఉంది. బన్నీ సరే అంటే ముందు ఈ సినిమా స్టార్ట్ చేసి.. నాగచైతన్యను హోల్డ్ లో పెట్టాలని చూస్తున్నాడు పరశురామ్.