డైరెక్టర్ క్రిష్ తో వన్స్ మోర్ అంటున్న అల్లు అర్జున్, క్రేజీ రూమర్ లో నిజం ఎంత..?
ప్రస్తుతం పుష్ప సీక్వెల్ హడావిడిలో ఉన్నాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇక ఈసినిమా తరువాత చేయవలసిన సినిమాల విషయంలో కూడా పక్కా ప్లానింగ్ లో ఉన్నాడు. ఈక్రమంలో డైరెక్టర్ క్రిష్ తో బన్నీ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. పుష్పతో వచ్చిన ఇమేజ్ ను మించిన ఇమేజ్ ను సాధించడం కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈసారి పుష్ప2 సినిమాతో వెయ్యి కోట్ల కలెక్షన్లే లక్ష్యంగా, ఆస్కార్ కు ఈసినిమాను తీసుకువెళ్ళడమే ప్లాన్ గా.. చాలా జాగ్రత్తగా పుష్ప2ను తెరకెక్కిస్తున్నారు. ఈ దెబ్బతో అల్లు అర్జున్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.
ఇక ఈసినిమా తరువాత కూడా బన్నీ రెండు సినిమాలను లైన్ లో పెట్టుకుని ఉన్నాడు. అందులో తనకు మూడు సినిమాలతో హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీత్రివిక్రమ్ తో నాలుగో సినిమా చేయబోతున్నాడు బన్నీ.. ఇక ఈసినిమాతో పాటు.. అర్జున్ రెడ్డి పేమ్. సందీప్ వంగా డైరెక్షన్ లో కూడా అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు. అయితే బన్నీ లిస్ట్ లోకి ముచ్చటగా మూడో సినిమా వచ్చి చేరింది. ఆయన లిస్ట్ లోకి తాజాగా ఇప్పుడు మరో దర్శకుడు ఈ లైన్ లోకి వచ్చాడు.
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తో అల్లు అర్జున్ ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుకు సంబంధించిన ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ రెండు లుక్స్ తో ఉన్న ఆ ఫోటోలో.. ‘కబీ అప్నే, కబీ సప్నే’ ఏ ఫిలిం బై క్రిష్. త్వరలో రాబోతుందంటూ పోస్ట్ కనిపిస్తుంది. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈక్రమంలో క్రిష్ తో బన్నీ సినిమాను కన్ ఫార్మ్ చేస్తున్నారు.
ఇక నెటిజెన్స్ అల్లు అర్జున్, క్రిష్ కలిసి బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నారా..? అని కామెంట్లు పెడుతున్నారు. రకరకరాల సందేహాలు వ్యాక్తం చేస్తున్నారు.. కాగా క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పవన్ ఈ సినిమాకి డేట్స్ ఇవ్వకపోవడంతో.. ప్రస్తుతం క్రిష్ ఖాళీగానే ఉంటున్నాడు. ఇక ఈ గ్యాప్ రావడంతో ఆ మధ్య వైష్ణవ తేజ్ తో కొండా పొలం అనే సినిమాను తెరకెక్కించాడు. మరి ఇప్పుడు అల్లు అర్జు తో కూడా మరో మూవీ తెరకెక్కిస్తున్నాడా..? అనే సందేహం కలుగుతుంది.
కాగా వీరిద్దరి కలయికలో గతంలో వేదం సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు నిజంగా ఈ కాంబినేషన్ పట్టాలు ఎక్కబోతుందా లేదా చూడాలి. అయితే ఇది ఓటీటీ కంటెంట్ అయ్యి ఉండవచ్చని తెలుస్తుంది. ఇటీవల త్రివిక్రమ్, అల్లు అర్జున్ కూడా ‘ఆహా’ కోసం ఒక యాడ్ షూట్ చేశారు. దానికి ముందు సినిమా అంటూ ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు. దీంతో ఇప్పుడు ఇది కూడా అలాంటిదే అయ్యి ఉంటుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో పక్క పవన్ అభిమానులు.. వీరమల్లు సంగతి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.