నా పేరు సూర్య సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ ఎలాగైనా హిట్ కొట్టాలని త్రివిక్రమ్ తో కలిసిన సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాలో బన్నీ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. 

రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసిన బన్నీ నెక్స్ట్ షెడ్యూల్ ని ఈ నెల 27న స్టార్ట్ చేయనున్నాడు. ఈ షెడ్యూల్ లో ఎక్కువగా బన్నీ ఫ్యామిలీతో సరదగా గడిపే సన్నివేశాలు ఉంటాయట. అలాగే పూజ హెగ్డే కూడా బన్నీ టైమింగ్ కి తగ్గట్టుగా కామెడీ పండించేందుకు రెడీ అవుతోంది. ఫుల్ ఫన్ లో ఒక ఉమ్మడి కుటుంబం మధ్య ఉండే ఆనందాల్ని దర్శకుడు త్రివిక్రమ్ ప్రోజెక్ట్ చేయనున్నాడు. 

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా తన సంగీతంతో ఆకట్టుకుంటాడని తెలుస్తోంది. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీలకం కానుంది. ఇప్పటికే రెండు ట్యూన్ లను సెట్ చేసిన థమన్ చిన్న బిట్ సాంగ్ ని కూడా త్రివిక్రమ్ కోరిక మేరకు ట్యూన్ చేసినట్లు సమాచారం. మరి ఈ సినిమాతో అయినా త్రివిక్రమ్ పూర్తి స్థాయిలో మెప్పిస్తాడో లేదో చూడాలి.