అభిమాని కోరిక తీర్చిన అల్లు అర్జున్

Allu Arjun meets his fan suffering from Bone Cancer
Highlights

అభిమాని కోరిక తీర్చిన అల్లు అర్జున్

విశాఖపట్నంలోని అనాకపల్లిలో బోన్‌ కేన్సర్‌తో బాధితుడుతోన్న దేవసాయి గణేశ్‌ అనే యువకుడికి సినీనటుడు అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న దేవసాయి గణేశ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన అభిమాన నటుడు అల్లు అర్జున్‌ను చూడాలని, అదే తన చివరి కోరిక అని వైద్యులకి చెప్పాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అల్లు అర్జున్‌... ఈ రోజు సాయంత్రం అనకాపల్లికి వెళ్లి దేవసాయి గణేశ్‌ ను పరామర్శించాడు. దేవసాయి గణేశ్‌ను ఆప్యాయంగా పలకరించి కాసేపు మాట్లాడాడు. దీంతో దేవసాయి గణేశ్‌ హర్షం వ్యక్తం చేశాడు.  
 

loader