Asianet News TeluguAsianet News Telugu

Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప మేనియా... సంచనాలు చేస్తున్న సుడిగాలి సుధీర్ స్కిట్


దేశవ్యాప్తంగా పుష్ప సంచలనం రేపుతోంది. సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప మూవీలోని మేనరిజం ట్రై చేస్తున్నారు. ఇక పుష్ప సినిమాను అనుకరిస్తూ అనేక స్పూఫ్ వీడియోలు, స్కిట్స్ రూపొందిస్తుండగా... వాటికి కూడా భారీ ఆదరణ దక్కుతుంది. 

allu arjun mania pushpa spoof skit in jabardasth getting record views
Author
Hyderabad, First Published Jan 28, 2022, 3:56 PM IST


తెలుగు పాపులర్ కామెడీ షో జబర్దస్త్ లో గత వారం సుడిగాలి సుధీర్ టీమ్ పుష్ప(Pushpa)స్పూఫ్ స్కిట్ చేశారు. సుధీర్ అల్లు అర్జున్ పుష్ప గెటప్ వేయగా గెటప్ శ్రీను ఫహాద్ ఫాజిల్ చేసిన భన్వర్ లాల్ షెకావత్ గా, రామ్ ప్రసాద్ కేశవ గెటప్ వేయడం జరిగింది. ఈ స్కిట్ లో సుడిగాలి వేసిన జోకులు మాములుగా పేలలేదు. ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది పుష్ప స్కిట్ రికార్డు వ్యూస్ అందుకుంది. కేవలం ఆరు రోజుల్లో సుడిగాలి సుధీర్ స్కిట్ 10 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఇంత తక్కువ సమయంలో కోటి వ్యూస్ అంటే సామాన్యమైన విషయం కాదు. 

యూట్యూబ్ లో ఈ స్కిట్ సంచనాలు నమోదు చేస్తుంది. మరో స్టార్ కమెడియన్. హైపర్ ఆది సైతం పుష్ప స్పూఫ్ స్కిట్ చేశారు. ఇది కూడా  ,మంచిగా ఆదరణ దక్కించుకుంటుంది. పుష్ప గెటప్ లో ఆది వేసిన పంచ్ లు దుమ్ము రేపాయి. పుష్ప పేరున వస్తున్న ప్రతి వీడియో, ఈవెంట్ సూపర్ సక్సెస్ అవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ పుష్ప మేనియా ఈ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. 
పుష్ప హిందీ లో సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అంటున్నారు.

 హిందీ వర్షన్ అనూహ్య విజయం సాధించగా అక్కడ ఆయనకు మార్కెట్ ఏర్పడింది. పుష్ప ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించగా సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. పార్ట్ 2 భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తీర్చదిద్దనున్నట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప చిత్రాన్ని తెరకెక్కించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా... దేవిశ్రీ సంగీతం అందించారు. 

మైత్రి మూవీ మేకర్స్ పుష్ప చిత్రానికి నిర్మాతలుగా ఉన్నారు. ఇక పుష్ప విజయం నేపథ్యంలో అల్లు అర్జున్ తో మూవీ చేయడానికి స్టార్ డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. ఇకపై అల్లు అర్జున్ నుండి రానున్న చిత్రాలన్నీ భారీ స్థాయిలో ఉండనున్నాయి. బన్నీ రెమ్యూనరేషన్ సైతం విపరీతంగా పెంచేశారట. ఆయన రెమ్యూనరేషన్ యాభై కోట్లకు దాటిపోయినట్లు వార్తలు అందుతున్నాయి. ఏది ఏమైనా అల్లు అర్జున్ ఇమేజ్ ఊహించని స్థాయికి చేరింది. 

అయితే పుష్ప తెలుగు వెర్షన్ అనుకున్నంతగా వసూళ్లు అందుకోలేదు. ఆంద్రప్రదేశ్ లో నష్టాలు మిగిల్చిన పుష్ప తెలంగాణాలో జస్ట్ బ్రెత్ ఈవెన్ రీచ్ అయ్యింది. హిందీ, మలయాళ భాషల్లో పుష్ప అత్యధిక లాభాలు రాబట్టింది. 

Follow Us:
Download App:
  • android
  • ios