తెలుగు చిత్ర పరిశ్రమలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో పుష్ప ఒకటి. అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మంగళవారం నుంచి మొదలు అయ్యింది. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇక ఈ షూటింగ్‌లో ప్రధాన పాత్రాదారులు అందరూ పాల్గొనగా.. దాదాపు నెల రోజుల పాటు  షూటింగ్ జరగనుంది. కాగా ఈ మూవీలో అల్లు అర్జున్‌ కొత్త లుక్‌లో కనిపించనుండగా.. షూటింగ్‌లో బన్నీ లుక్‌ లీక్ బయటకు వచ్చి అందరికీ షాక్ ఇస్తోంది.

లీకైన ఫొటోలో బన్నీ పక్కా మాస్‌ లుక్‌లో.. వెంటనే గుర్తుపట్టలేని విధంగా కనిపించి, సర్‌ప్రైజ్‌ చేశారు. ఆయన లుక్‌ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. తర్వాతి సినిమా ద్వారా అల్లు అర్జున్‌ అందరికీ ట్రీట్‌ ఇవ్వబోతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇక ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని ఏప్రియల్ 28,2021న విడుదల చెయ్యాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు మాచారం. వేసవి శెలవలు కలిసొస్తాయని మాత్రమే కాకుండా మెగా హిట్ సాధించిన బాహుబలి 2 సినిమా కూడా అదే తేదీన విడుదల అవటంతో , సెంటిమెంట్ గానూ కలిసొస్తుందని భావిస్తున్నారు.  దాంతో వచ్చే సంవత్సరం 2021 సమ్మర్ కు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అంతటా టెన్షన్ పడటం లేదు టీమ్.

కాగా ఈ మూవీలో బన్నీ చిత్తూరు జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన రష్మిక మొదటిసారి జత కట్టబోతోంది. జగపతి బాబు, ప్రకాష్‌ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ముత్తం శెట్టి క్రియేషన్స్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.