Asianet News TeluguAsianet News Telugu

#pusha2:వైరల్ అవుతున్న 'పుష్ప 2' లీక్ డైలాగు,మామూలుగా లేదుగా

అల్లు అర్జున్‌(Allu arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa 2)చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే! అల్లు అర్జున్‌-రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం సీక్వెల్ రెడీ అవుతోంది.

Allu Arjun leaked dialogue from #pusha2 goes viral
Author
First Published Dec 11, 2022, 3:48 PM IST

అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' సినిమాపై ఎంత క్రేజ్ ఉందో తెలియంది కాదు.  ఈ సినిమా గురించి చిన్న అప్డేట్ వచ్చినా వైరల్ అవయ్యిపోతోంది.  పుష్ప సినిమా ద్వారా  అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమాలో ఫవాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేష్ తో పాటు ఇంకో కొత్త విలన్ కూడా ఉన్నాడని ఒక వార్త నడుస్తోంది.  అయితే ఈ విలన్ ఎవరు అనేది ఇంకా  అఫీషియల్ గా బయిటకు రాలేదు.  పుష్ప రెండో పార్టులో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో వుండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఓ డైలాగు లీక్ అయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ డైలాగు నిజంగా సినిమాలో ఉందో లేదో కానీ ఓ రేంజిలో ఫ్యాన్స్ కు నచ్చేస్తోంది. ఇంతకీ ఆ డైలాగు ఏమిటంటే...

"అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్ధం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్థం"

ఇక ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ మొదలై జరుగుతోంది.   పుష్ప రెండో పార్టు షూటింగ్ ఈనెల అంటే డిసెంబర్ 17, 18, 19 మూడు రోజుల పాటు సికింద్రాబాద్ లోని ఒక గవర్నమెంట్ కాలేజీ లో షూటింగ్ జరుగుతుందని తెలిసింది. పుష్ప మొదటి పార్టు లో ఎక్కడ అయితే ఆపారో ఆ తరువాత జరగబోయే సన్నివేశాలు కొన్ని ముందుగా చిత్రీకరించాలని దర్శకుడు సుకుమార్ అనుకున్నట్టుగా తెలిసింది. అలాగే మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్ చాల బిజీ గా ఉండటం తో అతని డేట్స్ కుదరటం కూడా చాలా కష్టం అని తెలిసింది. అందువల్ల అతను ఒక మూడు రోజుల పాటు ఈ పుష్ప సినిమా షూటింగ్ కి డేట్స్ ఇచ్చాడని, అందువల్ల అతని సన్నివేశాలను ముందుగా మొదలెడుతున్నారని తెలిసింది. 
   
మరో ప్రక్క పుష్ప సినిమాలో తాను చెప్పిన డైలాగ్ తగ్గేదేలే ఎలా హిట్ అయిందో మనకు తెలిసిందే.అయితే పుష్ప2 లో మాత్రం అస్సలు తగ్గేదేలే అనే డైలాగ్ ఉండబోతుంది అంటూ  అల్లు అర్జున్ తన సినిమా గురించి అప్డేట్ గతంలో ఇచ్చారు. దాంతో ఈ సినిమా గురించి  అభిమానులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తూ అస్సలు తగ్గకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios