Asianet News TeluguAsianet News Telugu

పాయల్ కోసం పుష్పరాజ్ వస్తున్నాడు.. రేపే ఈవెంట్

అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతుండటంతో.. పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ మూవీ ‘మగళవారం’ ప్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి. అటు అల్లు ఆర్మీ కూడా వేడుకకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఈవెంట్ ఎక్కడ?  
 

Allu Arjun is the Chief Guest for Payal Rajput movie Event NSK
Author
First Published Nov 10, 2023, 10:51 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. జాతీయ అవార్డుల పురస్కారం తర్వాత బన్నీ ఎలాంటి ఈవెంట్లకు హాజరు కాలేదు. ఫ్యాన్స్ తో నేరుగా మాట్లాడే అవకాశం లేకపోయింది. తాజాగా ‘మంగళవారం’ టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. 'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా Mangalavaaram. క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) , 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. 

ఈ చిత్రం నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'మంగళవారం' సినిమా విడుదల కానుంది. దీంతో యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రేపు (నవంబర్ 11 శనివారం) హైదరాబాద్ జె.ఆర్.సి. కన్వెషన్ సెంటర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అయితే, ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రానున్నారు. అల్లు ఆర్మీ, అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ఈవెంట్ కు గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. 

బన్నీ రాకతో ఈవెంట్ దద్దరిల్లేలా చేస్తున్నారు. పుష్పరాజ్ వస్తుండటంతో ‘పుష్ప2’పై ఏమైనా అప్డేట్ ఇస్తారనే ఆసక్తికూడా లేకపోలేదు. ఇక 'మంగళవారం' ట్రైలర్ ఇప్పటికే విడుదలై సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.ప్రీ రిలీజ్ వేడుకనూ గ్రాండ్ గానే నిర్వహిస్తుండటంతో మరింత హైప్ పెరుగుతుంది. డిఫరెంట్ కంటెంట్ అండ్ కమర్షియల్ బేస్డ్ సినిమాతో అజయ్ భూపతి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారనే నమ్మకం ప్రేక్షకులలో కలిగించారు.  

ఇక ఈ చిత్రంలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామిగా ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మతో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

Allu Arjun is the Chief Guest for Payal Rajput movie Event NSK

Follow Us:
Download App:
  • android
  • ios