భీమ్లా నాయక్ చిత్రం నేటి నుంచి ఓటిటిలో స్ట్రీమ్ అవుతోంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భీమ్లా నాయక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఫిబ్రవరిలో విడుదలై ఘనవిజయం సొంతం చేసుకుంది. రానా దగ్గుబాటి, పవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించింది. మలయాళీ సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియం చిత్రాన్ని త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా.. పవన్ కళ్యాణ్ క్రేజ్ కి అనుగుణంగా మార్చారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

థియేట్రికల్ రన్ ముగియగానే ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేశారు. నేటి నుంచే భీమ్లా నాయక్ చిత్ర ఓటిటి స్ట్రీమింగ్ మొదలయింది. ఆహా, డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భీమ్లా నాయక్ పై ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. 

ఆహా ఓటిటి అల్లు అర్జున్ ఫ్యామిలీకి చెందినదే. ఈ సందర్భంగా బన్నీ 'నేను పార్టీకి లేటయ్యాను. కానీ పవన్ కళ్యాణ్ గారికి బిగ్ కంగ్రాట్స్. రానా, త్రివిక్రమ్, తమన్, సాగర్ చంద్ర లకు కూడా కంగ్రాట్స్. భీమ్లా నాయక్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. హైయెస్ట్ క్వాలిటీలో ఆహాలో భీమ్లా నాయక్ చిత్రాన్ని ఎంజాయ్ చేయండి అంటూ అల్లు అర్జున్ పోస్ట్ పెట్టారు. 

భీమ్లా నాయక్ చిత్రం విడుదలైనప్పుడు మెగా ఫ్యామిలీకి చెందిన అందరు స్టార్స్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. కానీ అల్లు అర్జున్ మాత్రం స్పందించలేదు. దీనితో నెటిజన్ల మధ్య చర్చ కూడా జరిగింది. లేటుగా అయినా పుష్ప పార్టీకి జాయిన్ కావడంతో మెగా ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. 

భీమ్లా నాయక్ విడుదలైన నెల రోజుల లోపే ఓటిటిలో రిలీజ్ కావడం విశేషం. ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థలు పోటీ పడి మరీ భీమ్లా నాయక్ ఓటిటి స్ట్రీమింగ్ ని ప్రమోట్ చేస్తున్నాయి. భీమ్లా నాయక్ ఓటిటిలో రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ షురూ చేశారు. ఇక బన్నీ ఈ ఏడాది పుష్ప 2 పై ఫోకస్ పెట్టనున్నాడు.