స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న 'అల.. వైకుంఠపురములో..' సినిమా ఫస్ట్‌లుక్‌ను ఈ రోజు( ఆదివారం) విడుదల చేసారు. ఈ లుక్ ని చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని  విడుదల చేయబోతున్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ సన్నివేశాన్ని టీజర్‌ రూపంలో విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చిన  సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ 19వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' వంటి హిట్‌ చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. 

పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో టబు, జయరాం, నివేదా పేతురాజ్‌, సుశాంత్‌, సునీల్‌ తదితరులు నటిస్తున్నారు. తమన్‌  సంగీతం  అందిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. '