ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెల్ఫీ దిగడానికి ఆసక్తిగా వచ్చిన అభిమానిని పట్టించుకోకుండా వెళ్లిపోయిన వీడియో వైరల్ అవుతోంది. దాంతో బన్నీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరు. గత సంవత్సరం విడుదలైన "పుష్ప 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి సంచలనంగా మారాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ లాంటి చాలా మంది స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.
'పుష్ప' సినిమా సక్సెస్ తర్వాత, అల్లు అర్జున్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైమ్ లో ఆయన అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నట్లు ఇటీవలే కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా గురించి వార్తలు తరచుగా వస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఇది పాన్ వరల్డ్ మూవీ అని చెప్పారు.
అట్లీ ఆలోచన నా ఆలోచన కూడా ఒకటే. ఇది ఖచ్చితంగా డిఫరెంట్ మూవీ అవుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.
ఇదిలా ఉండగా, రీసెంట్ గా అల్లు అర్జున్ వీడియో ఒకటి విడుదలై ట్రోలింగ్ కుకారణం అయ్యింది. వేవ్స్ సమ్మిట్ కు వెల్లిన బన్నీ..ముంబయ్ ఎయిర్ పోర్ట్ లో వెళ్తుండగా, ఓ ఫ్యాన్ ఆయనతో సెల్ఫీ దిగుదామని పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అల్లు అర్జున్ ఆయన్ని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీన్ని చూసి చాలా మంది ఫ్యాన్స్, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అజిత్, విక్రమ్, నాని, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఫ్యాన్స్ సెల్ఫీ అడిగితే ఓపిగ్గా దిగుతారు. కానీ అల్లు అర్జున్ ఇలా చేయడం ఓవర్ యాటిట్యూడ్ లా ఉందని అంటున్నారు. ఈ సంఘటన ఇప్పుడు దుమారం రేపుతోంది. అంతే కాదు బన్నీ చేసిన ఈ పనివల్ల .. సౌత్ యాక్టర్స్ అందరిని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.