పాయల్ కు సాయంగా అల్లు అర్జున్, మంగళవారం ఈవెంట్ కు ఐకాన్ స్టార్..?
పాయల్ రాజ్ పుత్ కు సాయంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నారా..? పాయల్ సినిమా కోసం చీఫ్ గెస్ట్ గా బన్నీని ఆహ్వానించారా..? అసలు విషయం ఏంటంటే..?

చిన్న హీరో.. చిన్న సినిమాలు.. లేదా పెద్ద సినిమాలు ఏవైనా కాని.. తమ ప్రమోషన్ కోసం స్టార్ హీరోలను ఉపయోగించుకోవడం చూస్తూనే ఉంటా. మరీ ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు చీఫ్ గెస్ట్ లు గా స్టార్ హీరోలు రావడం కామన్ అయిపోయింది. దాని వల్ల ఆ సినిమాకు ప్రమోషన్ అవ్వడంతో పాటు.. స్టార్ హీరోల ఇమేజ్ కూడా పెరుగుతుంది. దాంతో ఆ హీరోలు కూడా కొన్ని సెలెక్టెడ్ ఈవెంట్లు చూసుకుని ముఖ్య అతిధులు గా మెరుస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ ఫార్ములానే ఫాలో అవుతున్నారు.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో .. ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలన సృష్టించిన హిట్ దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం మంగళవారం. వీరి కాంబోలో ఆర్ ఎక్స్ 100 సూపర్ హిట్అవ్వడంతో ఈమూవీ పై కూడా అచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే వచ్చిన పోస్టర్ లు మరియు ట్రైలర్ లు సాలిడ్ అటెన్షన్ ని తీసుకొచ్చుగా మేకర్స్ అయితే ఇప్పుడు మంచి ప్రమోషన్స్ ని కూడా చేస్తున్నారు.
ఇక ఈ సినిమాని మేకర్స్ మరింతగా ప్రమోట్ చేయడం కోసం మార్గాలువెతుక్కుంటున్నారు. జనాల్లోకి చాలాస్ట్రాంగ్ గా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మూవీ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే సన్నాహాలు చేస్తుండగా... ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నవంబర్ 11న చేయాలని నిర్ణయం తీసుకున్నారట. అంతే కాదు ఈ ఈవెంట్ కి మేకర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. మ్యాటర్ ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ కాగా దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా ఈ నవంబర్ 17న సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.