అల్లు అరవింద్ కి అతడి కుమారుడు అల్లు అర్జున్ కి మధ్య గొడవలు వస్తున్నాయని, సినిమాలకు సంబంధించిన విషయాల్లో ఇద్దరి ఆలోచనలు భిన్నంగా ఉన్నాయని.. ఇద్దరికీ అసలు పడడం లేదని ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు వచ్చాయి. వీటిపై అల్లు అర్జున్ స్పందించాడు.

తాజాగా ఆయన ఓ గల్ఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రితో గొడవపై క్లారిటీ ఇచ్చాడు. ''నాన్నతో నాకు పడడం లేదని ఈ మధ్య వార్తలు వచ్చాయి. అవి నేను కూడా చదివా.. నేను, నాన్న ఒకే ఇంట్లో ఉంటున్నాం. రెగ్యులర్ గా చాలా విషయాలపై మేం చర్చించుకుంటాం. అలాంటిది మా మధ్య గొడవలేంటి..? ఈ వార్తలు చూసి నవ్వుకున్నాం.. ఫన్నీగా అనిపించాయి'' అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఇదే ఇంటర్వ్యూలో మరికొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. కొన్నిసార్లు తన గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తూ.. తన లుక్స్ ని పరిశీలించుకుంటూ.. ప్రతి సినిమాలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి చూస్తుంటానని చెప్పుకొచ్చాడు.

వారసత్వం గురించి మాట్లాడుతూ.. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకుండా.. ఫైనల్ గా టాలెంట్ ముఖ్యమని..  ప్రతిభ ఉన్నవాళ్ళే ఇండస్ట్రీలో కొనసాగుతారని అన్నారు. ప్రస్తుతం ఈ హీరో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.