Asianet News TeluguAsianet News Telugu

భార్య కౌగిలిలో పుష్పరాజ్ అరెస్ట్.. బన్నీకి స్నేహ రొమాంటిక్ ముద్దు, ఇంటర్నెట్ షేక్ చేస్తున్న పిక్ ఇదిగో

బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారు. ఇటీవల అల్లు అర్జున్, అల్లు స్నేహ దంపతులు వరుణ్ తేజ్ వివాహంలో సందడి చేశారు.

Allu Arjun Gets romantic kiss from Allu Sneha dtr
Author
First Published Nov 10, 2023, 7:26 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో ఫుల్ బిజీగా ఉన్నారు. గల్లీ పోరగాళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్ స్టార్స్ వరకు పుష్ప మ్యానియా పాకేసింది. పుష్ప చిత్రంలోని బన్నీ స్టెప్పులు, మ్యానరిజమ్స్ ఎంతలా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా సూపర్ హిట్ గా నిలవడంతో రెండవ భాగంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో పుష్పరాజ్ ఎలా డాన్ గా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో పుష్పరాజ్, షికావత్ మధ్య పోరాటం తారాస్థాయిలో ఉండబోతోంది. 

అయితే బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారు. ఇటీవల అల్లు అర్జున్, అల్లు స్నేహ దంపతులు వరుణ్ తేజ్ వివాహంలో సందడి చేశారు. అల్లు స్నేహ కూడా భర్త లాగే స్టైల్ ఐకాన్. అల్లు స్నేహ ట్రెండీ దుస్తుల్లో ఫోటోలు షేర్ చేయడం చూస్తూనే ఉన్నాము. 

Allu Arjun Gets romantic kiss from Allu Sneha dtr

తాజాగా అల్లు స్నేహ ఇంటర్నెట్ బ్రేక్ అయ్యే పిక్ షేర్ చేసింది. తన భర్తని కౌగిలిలో బంధించి రొమాంటిక్ గా ముద్దు ఇస్తున్న పిక్ ని షేర్ చేసింది. ఈ ఫొటోలో అల్లు అర్జున్ వెనుక నుంచి కనిపిస్తున్నారు. ఎంతో రొమాంటిక్ గా ఉన్న అల్లు దంపతులని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భార్య కౌగిలిలో పుష్పరాజ్ అరెస్ట్ అయ్యాడు అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 

అల్లు స్నేహ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్. అయితే ఇలా రొమాంటిక్ పిక్ పోస్ట్ చేయడం బన్నీ ఫాన్స్ కి కాస్త ఆశ్చర్యంగానే ఉంది. బన్నీ, స్నేహ 2011లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అల్లు అయాన్, అల్లు అర్హ సంతానం. 

Follow Us:
Download App:
  • android
  • ios