సినిమా షూటింగ్ లో జరిగే కొన్ని పరిచయాలు ఆ తర్వాత స్నేహాలుగా బలపడతాయి.  అల్లు అర్జున్, నవదీప్‌ కలిసి ‘ఆర్య 2’ సినిమాలో నటించారు. ఇందులో వీరిద్దరు స్నేహితులుగా కనిపిస్తారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌  కోసం వీరిద్దరి పోటీ పడటం కనిపిస్తుంది. ఈ సినిమా మంచి సక్సెస్  అందుకుంది. 

అప్పటి నుంచే అల్లు అర్జున్, నవదీప్‌ నిజ జీవితంలోనూ  స్నేహితులు గా మారిపోయారు. రీసెంట్ గా నవదీప్‌ స్థాపించిన సి స్పేస్ అనే   సంస్థను అల్లు అర్జున్‌ లాంచ్ చేసారు.

తన స్నేహాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్‌ కోసం నటుడు నవదీప్‌ ఓ స్పెషల్ గిప్ట్ ను సిద్ధం చేయించారు. ‘రుద్రమదేవి’ సినిమాలో బన్నీ ‘గోనగన్నా రెడ్డి’ పాత్రలో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. బన్ని  ‘గమ్మునుండవోయ్..’ అంటూ చెప్పిన డైలాగ్‌లు, ఎక్సప్రెషన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. 

అందుకే ఈ సినిమాలో బన్నీ లుక్‌లో ఉన్న చిన్న విగ్రహాన్ని నవదీప్‌ తయారు చేయించారు. దీన్ని తన ప్రెండ్, బావ బన్నీకి ఇవ్వబోతున్నట్లు సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. ‘బావకి ప్రేమతో ఓ చిరు కానుక’ అని నవ్వుతూ అల్లు అర్జున్‌ను ట్యాగ్‌ చేశారు.