బన్నీ కెలుకుడు మళ్లీ షురూ!

First Published 18, Jun 2018, 11:11 AM IST
allu arjun gave some suggestions to vikram kumar
Highlights

ఒక్కో హీరోకి ఒక్కో అలవాటు.. కొందరు స్క్రిప్ట్ లాక్ చేసిన తరువాత ఇక డైరెక్టర్ చెప్పినట్లో ఫాలో అయిపోతారు

ఒక్కో హీరోకి ఒక్కో అలవాటు.. కొందరు స్క్రిప్ట్ లాక్ చేసిన తరువాత ఇక డైరెక్టర్ చెప్పినట్లో ఫాలో అయిపోతారు. దర్శకులకు పూర్తి స్వేచ్చనిస్తారు. మరికొందరు సెట్స్ పైకి వెళ్లకముందే తమకు నచ్చని సీన్స్ ను మార్చి రాయమంటారు. మరికొందరైతే సెట్స్ పైకి వెళ్లినా.. తమ కెలుకుడు మాత్రం ఆపరు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే ముందుగానే స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు.

సెట్స్ పైకి వెళ్లిన తరువాత కూడా కథ విషయంలో ఇన్వాల్వ్ అవుతుంటాడని టాక్. దర్శకుడికి పూర్తి స్వేచ్చనివ్వడని అంటుంటారు. వక్కంతం వంశీ విషయంలో కూడా ఇదే జరిగింది. చివరకి రిజల్ట్ చూస్తే అది కాస్త ఫ్లాప్. కనీసం ఇప్పటికైనా.. తన కెలుకుడు కార్యక్రమం పక్కన పెడుతున్నాడా..? అంటే లేదు. తన తదుపరి చిత్రాన్ని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతానికి ఇది అనధికార విషయం అయినప్పటికీ విక్రమ్ మాత్రం బన్నీ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. ఇటీవల కథ విన్న బన్నీ సెకండ్ హాఫ్ లో మార్పులు చేయమని సూచించాడట.

అలా విక్రమ్ కు సలహాలు ఇచ్చిన తరువాతే ఫారిన్ ట్రిప్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీకు నచ్చే విధంగా కథ రెడీ చేస్తున్నాడు విక్రమ్. అది నచ్చితే వెంటనే సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్తారు. లేదంటే సీన్ లోకి మరో డైరెక్టర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఏదేమైనా.. బన్నీ ఫ్లాప్ లు అందుకుంటున్నా.. తన కెలుకుడిని మాత్రం ఆపట్లేదు.