జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మానియాతో జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు ఊగిపోతున్నారు. జనసేన పార్టీ పోటీ చేసిన దాదాపు అన్ని స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మానియాతో జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు ఊగిపోతున్నారు. జనసేన పార్టీ పోటీ చేసిన దాదాపు అన్ని స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్ అయితే అత్యధికంగా 70 వేలకి పైగా రికార్డ్ మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యే గా ఘనవిజయం సాధించారు.
దీనితో ఇటు సోషల్ మీడియాలో.. అటు బయట జనసేన పార్టీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. కూటమి తిరుగులేని మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. జనసేన 21 స్తనాలకి గాను 21 గెలిచేలా ముందుకు వెళుతోంది.
పవన్ కళ్యాణ్ విజయం ఖరారు కాగానే సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపారు. అద్భుత విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాట్స్.
మీరు పడ్డ కష్టం, డెడికేషన్, ప్రజలకు సేవ చేయాలనే తపన హృదయాని హత్తుకునేలా ఉన్నాయి. ప్రజలకు సేవ చేసే క్రమంలో మీరు మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లి అక్కడి వైసిపి అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డికి సపోర్ట్ ఇచ్చారు. రవిచంద్ర రెడ్డి విజయం సాధించాలని కోరారు. రవిచంద్ర రెడ్డి తన స్నేహితుడు అని ఆయన ఎన్నికల్లో విజయం సాధించాలని కోరారు. దీనితో ఆ సమయంలో అల్లు అర్జున్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు శిల్పా రవిచంద్ర రెడ్డి నంద్యాల నియోజకవర్గంలో వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది.
