స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 

షూటింగ్ నుంచి విరామం దొరికిందో ఏమో కానీ బన్నీ తన సమయాన్ని కుటుంబ సభ్యులకు కేటాయిస్తున్నాడు. బన్నీ తన కుమార్తె అల్లు అర్హతో ఆడుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. బన్నీ తన కుమార్తె తో 'ఫసక్' డైలాగ్ చెప్పించాడు. ఓన్లీ వన్స్.. ఫసక్ అంటూ అర్హ ముద్దు ముద్దుగా చెబుతున్న మాటలు ఆకట్టుకుంటున్నాయి. 

ఫసక్ అంటూ అర్హ దువ్వెనతో బన్నీ గొంతు కోస్తున్నట్లు సరదాగా తండ్రిని ఆటపట్టించింది. అల్లు అర్జున్ చివరగా నటించిన నాపేరు సూర్య చిత్రం ఆశించిన మేరకు రాణించలేదు. దీనితో తన అభిమానులకు బన్నీ ఓ మంచి చిత్రాన్ని అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత బన్నీ సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు.