Asianet News TeluguAsianet News Telugu

చిన్నారి అభిమాని మృతి, సంతాపం తెలిపిన అల్లు అర్జున్

చివరి కోరిక తీరకుండానే ఓ చిన్నారి అభిమాని మరణించిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వీరాభమాని  ఆయన్ను చూడకుండానే తిరిగిరానిలోకాలకు వెళ్ళిపోయాడు. 
 

Allu Arjun Fan passes away due to cancer JmS
Author
First Published Sep 14, 2023, 10:48 AM IST


చివరి కోరిక తీరకుండానే ఓ చిన్నారి అభిమాని మరణించిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వీరాభమాని  ఆయన్ను చూడకుండానే తిరిగిరానిలోకాలకు వెళ్ళిపోయాడు. 

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నాడు బన్నీ. పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా ఇమేజ్ సాధించాడు అల్లు అర్జున్. అయితే బన్నీ అభిమానులు దేశ వ్యాప్తంగా ఉన్నారు. అందులో ఓచిన్నారి అభిమాని తిరిగిరాని లోకాలకువెళ్ళిపోయారు. కాన్సర్ తో పోరాడుతూ.. ఆ బాబు మంగళవారం కన్నుమూశాడు. అల్లు అర్జున్ అన్నా.. ఆయన నటన, డాన్స్ అంటే ఆ పిల్లాడికి ప్రాణం. అయితే ఎప్పటి నుంచో బన్నీని చూడాలని అనుకుంటున్నాడు చిన్నారు. కాని ఆ కోరిక తీరకుండానే బాబు కన్నుమూశాడు. 

వివరాల్లోకి వెళ్తే.. అల్లు అర్జున్‌కు కష్ణా జిల్లా ఇందుపల్లికి చెందిన 12 ఏళ్ల శ్రీవాసుదేవ వీరాభిమాని. అయితే చిన్నతనంలోనే పిల్లాడు క్యాన్సర్‌తో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. హైదరాబాద్‌లో ఉంటున్న అతడతనకు వీరాభిమాని అని తెలిసి.. బన్నీ అతన్ని కలుసుకునేందుకు నటుడు రెడీ అయ్యాడు. కాని ఈలోపే  ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న అల్లు అర్జున్ బాలుడి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.

ఇక అల్లు అర్జున్ సినిమాలు చూసుకుంటే.. ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప2 సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు అల్లు అర్జున్. ఈసినిమాను అచ్చే ఏడాది అగస్ట్ లో రిలీజ్ చేయబోతన్నట్టు ప్రకటించారు టీమ్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సాధించిన బన్నీ.. పుష్ప2 సినిమాతో వెయ్యికోట్ల కలెక్షన్లు.. ఆస్కార్ ను టర్గెట్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఇప్పటిక పుష్పకుగాను జాతీయ అవార్డ్ సాధించాడు అల్లు అర్జున్. 
 

Follow Us:
Download App:
  • android
  • ios