రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ తో కలిసి 'AMB' మల్టీప్లెక్స్ ని ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ మల్టీప్లెక్స్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అద్బుతమైన ఇంటీరియర్ డిజైన్ తో లగ్జరీగా ఈ థియేటర్ ని ఏర్పాటు చేశారు.

ఇప్పుడు అల్లు అర్జున్ కూడా థియేటర్ బిజినెస్ లోకి దిగాలని అనుకుంటున్నాడట. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు బన్నీ కూడా 'AA'అనే పేరుతో మల్టీప్లెక్స్ ని మొదలుపెట్టాలని చూస్తున్నాడు.

మహేష్ లానే మంచి డీల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏషియన్ సినిమాస్ పార్టనర్ సునీల్ నారంగ్ తో కలిసి అల్లు అర్జున్ ఇప్పుడు ఓ మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడట. అమీర్ పేట్ సెంటర్ లో ఉన్న సత్యం థియేటర్ అక్కడ ఏరియాల్లో ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే.

అయితే మల్టీప్లెక్స్ ల హవా పెరగడంతో ఈ థియేటర్ కి వచ్చే జనాలు కాస్త తగ్గారు. ఇప్పుడు ఆ థియేటర్ ప్లేస్ లో మల్టీప్లెక్స్ కట్టాలని అనుకుంటున్నారట. డీల్ గనుక కుదిరితే 'AAA' అనే పేరుతో ఈ మల్టీప్లెక్స్ వస్తుందని అంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ హైదరాబాద్ లో రెస్టారంట్ బిజినెస్ ఉంది. ఇప్పుడు మల్టీప్లెక్స్ లోకి కూడా దిగితే బిజినెస్ మెన్ గా కూడా బిజీ అవుతాడు.