అల వైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన త్రివిక్రమ్(Trivikram) నెక్స్ట్ మూవీ మహేష్ తో చేస్తున్నారు. ఈ కాంబినేషన్ కి ఓ ప్రత్యేకత ఉంది . అలాగే ఓ సెంటిమెంట్ కూడా. అది రిపీట్ అయితే ఆయనకు మరో ఇండస్ట్రీ హిట్ దక్కినట్లే. 

అల వైకుంఠపురంలో భారీ విజయం సాధించిన జోష్ లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో మూవీ ప్రకటించారు. కారణం స్పష్టంగా తెలియదు కానీ... ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. ఈ క్రమంలో త్రివిక్రమ్ ని లైన్ లో పెట్టాడు. స్టార్స్ ని ఇంప్రెస్ చేయడంతో దిట్టైన త్రివిక్రమ్ మహేష్ డేట్స్ పట్టేశాడు. ఈ మూవీ అధికారికంగా లాంచ్ కూడా అయ్యింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. 

విశేషం ఏమిటంటే మహేష్(Mahesh babu)-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. గతంలో వీరి కలయికలో అతడు, ఖలేజా చిత్రాలు తెరకెక్కాయి. అతడు మహేష్ ఆల్ టైం ఫేవరేట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఖలేజా మాత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే మహేష్ ని కొత్తగా ఆవిష్కరించిన మూవీ ఖలేజా.. 

త్రివిక్రమ్ హ్యాట్రిక్ చిత్రంతో భారీ హిట్ అందుకున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun)తో త్రివిక్రమ్ చేసిన అల వైకుంఠపురంలో హ్యాట్రిక్ చిత్రం. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత అల వైకుంఠపురంలో చిత్రంతో హ్యాట్రిక్ చిత్రం చేశారు. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంఠపురంలో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. బన్నీతో త్రివిక్రమ్ చేసిన జులాయి యావరేజ్ టాక్ తెచ్చుకుంటే, సన్ ఆఫ్ సత్యమూర్తి హిట్ టాక్ తెచ్చుకుంది. 

మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ చిత్రానికి ఉన్న మరో ప్రత్యేకత... హీరోయిన్ పూజా హెగ్డేతో కూడా త్రివిక్రమ్ కి హ్యాట్రిక్ మూవీ. అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో చిత్రాల తర్వాత పూజా హెగ్డేను మహేష్ 28వ చిత్రానికి త్రివిక్రమ్ రిపీట్ చేస్తున్నారు. అయితే ఈ హ్యాట్రిక్ సెంటిమెంట్ పవన్ విషయంలో ఫెయిల్ అయ్యింది. పవన్ తో త్రివిక్రమ్ హ్యాట్రిక్ చిత్రం అజ్ఞాతవాసి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కాబట్టి అల్లు అర్జున్ కి కలిసొచ్చింది సెంటిమెంట్ మహేష్ విషయంలో నిజమవుతుందని కచ్చితంగా చెప్పలేం. 

కాగా ఎప్పటిలాగే త్రివిక్రమ్ మహేష్ కోసం ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారని టాక్. ఇక ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 2023 సంక్రాంతి బరిలో మహేష్ త్రివిక్రమ్ మూవీ విడుదల చేయాలనేది మేకర్స్ ఆలోచన. మరోవైపు మహేష్ సర్కారు వారి పాట సమ్మర్ కానుకగా మే 12న విడుదల కానుంది.