నా పేరు సూర్య సినిమా డిజాస్టర్ అనంతరం అల్లు అర్జున్ మరో సినిమాను ఇంకా పట్టాలెక్కించలేదు. కొత్తా సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని ఎదురుచూస్తున్న సమయంలో త్రివిక్రమ్ తో మంచి కథతో రాబోతున్నట్లు అధికారికంగా చెప్పేసి అభిమానులకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. 

ఇకపోతే ప్రతిసారి డిఫరెంట్ యాంగిల్స్ లో కనిపించే బన్నీ ఈసారి అభిమానులకు మరింత స్పెషల్ గా కనిపించే విధంగా సిద్దమవుతున్నాడట. త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోయే సినిమాకలో బన్నీ ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ అరవింద సమేత లా కాకుండా ఫుల్ కామెడీ అండ్ యాక్షన్స్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

త్రివిక్రమ్ పంచ్ లు ప్రాసలు బన్నీ సినిమాలో పుష్కలంగా ఉంటాయని టాక్. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా బన్నీ ఫిట్ నెస్ తో రెండు డిఫరెంట్ షేడ్స్ లలో అలరిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని వర్కౌట్స్ చేసి త్రివిక్రమ్ తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాడు. రాధాకృష్ణ తో పాటు అల్లు అరవింద్ కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామ్యులు కానున్నారు. ఇక హీరోయిన్ గా కియారా అద్వానీని అనుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.