Asianet News TeluguAsianet News Telugu

"డీజే దువ్వాడ జగన్నాథమ్" మూవీ రివ్యూ

  • చిత్రం : డీజే దువ్వాడ జగన్నాథమ్
  • తారాగణం : అల్లు అర్జున్, పూజా హెగ్డే, వెన్నెల కిషోర్, సుబ్బ‌రాజు, రావు ర‌మేశ్, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని
  • సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
  • దర్శకత్వం : హరీష్ శంకర్
  • నిర్మాత : దిల్ రాజు
  • ఏసియానెట్ రేటింగ్ : 3/5
allu arjun dj duvvada jagannnadham movie review

కథ: 

దువ్వాడ జ‌గ‌న్నాథ శాస్త్రి(అల్లు అర్జున్) బ్రాహ్మ‌ణ కుటుంబానికి చెందిన వంట‌వాడు. పెళ్లిళ్ల‌లో త‌న వంట‌కాల రుచిని అంద‌రికీ పంచుతుంటాడు. త‌న చేతి వంట‌కు ఫిదా అయిపోయిన జ‌నాలు ఏ వేడ‌క‌కైనా జ‌గ‌న్నాథాన్నే పిలిచి వంట చేయిస్తారు. అంటే చుట్టు ప‌క్క‌ల ఓ ప‌ది ఇర‌వై ఊళ్ల‌లో ఏ వేడుకైనా శాస్త్రి చేతి వంట అక్క‌డ ఉండాల్సిందే. అలా.. ఓ పెళ్లి వేడుక‌లో హీరోయిన్ పూజ (పూజ హెగ్డే) ప‌రిచ‌యం అవుతుంది. ఆమె ఫ్యాష‌న్ డిజైన‌ర్. అలా వాళ్లిద్ద‌రూ ప్రేమించుకుంటారు. అయితే... వాళ్ల ఊరిలో ఉన్న బ్రాహ్మ‌ణ సంఘానికి చెందిన భూములు ఆక్ర‌మ‌ణ‌కు గుర‌వుతాయి. అయితే.. భూమి ఆక్ర‌మ‌ణ వెనుక ఓ డాన్ ఉంటాడు. ఆ డాన్ ను ఢీ కొట్ట‌డం కోసం పోలీస్ తో క‌లిసి డీజే పేరుతో ప‌ని చేస్తుంటాడు జ‌గ‌న్నాథం. అయితే.. ఆ డాన్ ఎవ‌రు? జ‌గ‌న్నాథం డీజే గా ఎందుకు మారాడు? అంతే కాదు.. భూమి ఆక్ర‌మ‌ణ పేరుతో అక్క‌డ జ‌రిగిన దారుణం ఏంటి? అంతే కాకుండా.. శాస్త్రి హైద‌రాబాద్ లో కొంత‌మంది ని టార్గెట్ చేసి మ‌రీ చంపేస్తుంటాడు? వాళ్ల‌ను చంపాల‌ని శాస్త్రిని పురుషోత్తం ప్రోత్స‌హిస్తాడు? పురుషోత్తం ఎవ‌రు? రొయ్య‌ల నాయుడు (రావు ర‌మేశ్) అక్ర‌మాల‌ను శాస్త్రి ఎలా బ‌య‌ట‌పెట్టాడు? ఇక చివరకు పూజను శాస్త్రి పెళ్లి చేసుకున్నాడా లేదా అనేదే  మిగతా సినిమా. 

నటీనటులు :

వంట‌వాడిగా, మ‌ర్డ‌ర్ చేస్తూ డీజేగా రెండు పాత్ర‌ల్లో వైవిధ్యంగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు అర్జున్. యాక్ష‌న్, డ్యాన్స్ లో మ‌ళ్లీ త‌న ప్ర‌తాపాన్ని చూపించాడు అల్లు అర్జున్. హీరోయిన్ పూజా హెగ్దే గ్లామ‌ర్ రోల్ పోషించింది. త‌న అందంతో ప్రేక్ష‌కుడి మ‌న‌సును దోచుకుంటుంది పూజ‌. మిగితా న‌టులంతా త‌మ పాత్ర‌ల మేర న‌టించారు. ఇక వంట‌వాడిగా అల్లు అర్జున్ చేసే సంద‌డి కామెడీ ని త‌ల‌పించ‌గా... డీజే గా ఆయ‌న చేసే యాక్ష‌న్ మాస్ ను త‌ల‌పిస్తుంది. ఫ‌స్టాఫ్‌లో బ‌న్నీ శాస్త్రిగా అగ్రహారంలో సీన్లు, పూజా హెగ్డేతో అత‌డి రొమాంటిక్ ట్రాక్‌, ముద్దు సీన్లు, బికినీ సీన్లు ఇలా ఎంట‌ర్‌టైనింగ్‌గా బండి న‌డిపించేశాడు.

allu arjun dj duvvada jagannnadham movie review

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు హరీష్ శంకర్ కథ పాతదే అయినా రిస్క్ తీసుకుని చేశాడని ఎక్కడా అనిపించలేదు. రొటీన్ స్టోరీకి మాస్ మసాలా అంతా జోడించి ఓకే అనిపించాడు. సినిమాలో పంచ్ డైలాగులు మాత్రం ప‌రెఫెక్ట్‌గా ఉండేలా చూసుకున్నాడు. హీరో క్యారెక్ట‌ర్లో శాస్త్రి అన్నది కాస్త కొత్తగా ఉన్నా అత‌డి బిహేవియ‌ర్ మాత్రం కొత్తగా ఉండ‌దు. విల‌న్లు, కామెడీ బ్యాచ్ మొత్తం అంతా పాత క్యారెక్టర్లే. వాళ్లు చేసే ప‌ని కొత్తగా ఉండ‌దు. ఫ‌స్టాఫ్ అంతా స్పీడ్‌గా న‌డిచిపోవ‌డంతో ప్రేక్షకులు త‌ప్పుల వెత‌క్కుండా ఎంజాయ్ చేస్తారు. ఫ‌స్టాఫ్‌లో ఉన్న మూడు పాట‌లు కూడా ప్లస్ అయ్యాయి. కీల‌క‌మైన సెకండాఫ్‌లో క‌థ‌నం రొటీన్ అయిపోయింది. సినిమాలో ట్విస్టులు ఉండ‌వు. బ‌న్నీ, డీజేకు లింక్ ఏంట‌న్నది కూడా ఎవ్వరికి ఆస‌క్తి క‌లిగించ‌లేదు. ఇక నిజాల కోసం శాస్త్రి ఫ్యామిలీని టార్గెట్ చేసేట‌ప్పుడు వ‌చ్చే ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు తేలిపోయాయి. ఇక క్లైమాక్స్‌లో కొడుకు సుబ్బరాజు చేతే తండ్రి రావూ ర‌మేష్‌ను షూట్ చేయించ‌డం బాగుంది. భీక‌ర‌మైన పోరాటాలు, యాక్షన్ సీన్లు లేకుండా సింపుల్‌గా క్లైమాక్స్ ఇవ్వడం కొత్తగా ఉంది. ఇక సినిమాకు సంగీతం పెద్ద ప్లస్ పాయింట్. దేవీశ్రీ సమకూర్చిన బాణీలు చాలా ఎనర్జిటిక్ గా అనిపించడమే కాక బన్నీ, పూజల స్టెప్స్ కూడా అంతే ఎనర్జిటిక్ గా అనిపించడంతో చాలా ప్లస్ అయింది.

 

ప్లస్ పాయింట్స్ : స్టైలిష్ స్టార్ నటన,డ్యాన్స్, ఫైట్స్, పూజా హెగ్డే గ్లామర్-డ్యాన్స్, హరీశ్ శంకర్ టేకింగ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ : సెకండాఫ్, రొటీన్ కథ

చివరగా : రొటీన్ కథే అయినా మాస్ మసాలాతో కూడిన డీజే

Follow Us:
Download App:
  • android
  • ios