ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన అభిమానిని సర్‌ప్రైజ్‌ చేశారు. తన అభిమాన హీరోని కలిసిన ఆనందంలో ఆ అభిమాని చేసిన పని వైరల్‌గా మారింది. 

హీరోలకు ఎంతో మంది అభిమానులుంటారు. వారిలో డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అభిమాన హీరోని ఎప్పుడైనా కలవాలని, పలకరించాలని వారంతా ఉవ్విళ్లూరుతుంటారు. వెయ్యి ఆశలతో వెయిట్‌ చేస్తుంటారు. అలాంటి అవకాశం వస్తే, అభిమాన హీరోని కలిస్తే, ఆయనతో మాట్లాడితే, ఓ ఫోటో దిగితే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. మాటల్లో వర్ణించలేం. అది లైఫ్‌ లాంగ్‌ బెస్ట్ మూమెంట్‌. తాజాగా అల్లు అర్జున్‌ అభిమానికి అలాంటి అనుభూతి కలిగింది. అలాంటి అవకాశం కల్పించారు ఐకాన్‌ స్టార్‌. 

తనని ఎంతో కాలంగా అభిమానిస్తూ ఉన్న ఒక అభిమానిని తనని కలిసేందుకు రాగా, అతన్ని కలిసే అవకాశం కల్పించాడు. ఇంటి వద్దకు పిలిపించాడు. అతని దగ్గర తీసుకుని ఆప్యాయంగా పలకరించారు. తన అభిమాన హీరో అంతటి అద్భుతమైన అవకాశం కల్పించడంతో ఆ అభిమాని కదిలిపోయాడు. ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు. బన్నీని హగ్‌ చేసుకుంటూ కన్నీరు మున్నీరయ్యాడు. ఆ ఆనందంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఏం చేయాలో అర్థం కాలేదు. బన్నీని చూస్తూ, హగ్‌ చేసుకుంటూ ఆనందాన్ని తన హవభావాలతో పలికించాడు. ఆనందభాష్పాలతో కనబరిచాడు. కన్నీరు మున్నీరయ్యారు. 

తాజాగా ఆ వీడియోని బన్నీ టీమ్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌ అవుతుంది. ఊపేస్తుంది. బన్నీ పెద్ద మనసుకి, అభిమాన ఆనందానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. అందరిని ఆకట్టుకుంటుంది. అతను చేసిన పనికి అలాంటి అనుభూతి మనకి కూడా కలిగేలా చేస్తుంది. తెగ ట్రెండ్‌ అవుతుంది. 

Read more:Allu Arjun: తెలుగులో సెకండ్‌ హైయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ ఐకాన్‌ స్టార్‌.. అట్లీ సినిమాకి ఎంత తీసుకుంటున్నాడంటే?

ఇక బన్నీ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఫహద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో దిశా పటానీ ఐటెమ్ సాంగ్‌ చేస్తుందని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీని ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నారు.

also read: `ఓజీ` నుంచి షాకింగ్‌ పోస్టర్‌ రిలీజ్‌ .. వామ్మో పవన్‌ రక్తపాతానికి పూనకాలే!